వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి తెలంగాణ ఫిర్యాదు

ఏపీలోని వెలిగొండ ప్రాజెక్టుపై కేంద్రానికి ఫిర్యాదు చేసింది రాష్ట్ర ప్రభుత్వం. వెలిగొండ ప్రాజెక్టుకు  నిధుల అంశంపై కేంద్ర ప్రభుత్వానికి లేఖ రాసింది. కేంద్ర జల శక్తి శాఖకు ENC మురళీధర్ లేఖ రాశారు. వెలిగొండ ప్రాజెక్టుకు ట్రైబ్యునల్ కేటాయింపులు లేవని లేఖలో వివరించారు. వరద జలాల ఆధారంగా వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టారని స్పష్టం చేశారు. వెలిగొండ ప్రాజెక్టుకు అనుమతుల్లేవని లేఖలో పేర్కొన్నారు రాష్ట్ర ENC. వెలిగొండ ద్వారా కృష్ణా బేసిన్ వెలుపలకు నీరు తరలిస్తున్నారని ఆరోపించారు. వెలిగొండపై గతంలోనే ఫిర్యాదు చేశామని గుర్తు చేశారు. అనుమతి లేని ప్రాజెక్టుకు కేంద్రం నిధులివ్వడంపై అభ్యంతరం చెప్పింది రాష్ట్ర ప్రభుత్వం. AIBP కింద నిధులు ఇచ్చేందుకు అర్హత ఉందో లేదో పరిశీలించాలని కోరింది.