తెలంగాణకు నవోదయం

తెలంగాణకు నవోదయం

తెలంగాణ ప్రజల ఆశీర్వాదంతో అధికారంలోకి  వచ్చిన  కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఏడాది పాలన పూర్తి చేసుకున్నది.  ప్రజా ప్రభుత్వం ఈ సంవత్సర కాలంలో అనేక  సంచలనాత్మక నిర్ణయాలను తీసుకున్నది. ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా పాలన సాగించింది.  కేసీఆర్‌‌‌‌‌‌‌‌ కుటుంబం గుప్పిట్లో బందీ అయిన తెలంగాణకు విముక్తి కల్పించింది.  కవులు, కళాకారులకు గౌరవాన్ని కల్పించింది. 

కేసీఆర్‌‌‌‌‌‌‌‌  పదేండ్లు చీకటి గదిలో  బంధించిన జయ జయహే తెలంగాణ గీతంను అధికార గీతంగా ప్రకటించి, తెలంగాణ ఆత్మగౌరవాన్ని ముఖ్యమంత్రి రేవంత్‌‌‌‌‌‌‌‌ దేశానికి చాటిచెప్పారు.  సీఎం రేవంత్​రెడ్డి  ప్రగతిభవన్‌‌‌‌‌‌‌‌  గేట్లకు అడ్డంగా ఉన్న ముళ్లకంచెలను బద్దలు కొట్టారు. సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌ తలుపులను ప్రజల కోసం తెరిపించారు. రాష్ట్ర పాలనా కేంద్రమైన సెక్రటేరియట్‌‌‌‌‌‌‌‌లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని  నెలకొల్పారు.  ప్రమాణ స్వీకారం చేసిన మొదలు ఒక్కరోజు కూడా విశ్రాంతి తీసుకోకుండా రాష్ట్రాభివృద్ధి కోసం సీఎం రేవంత్​ నిరంతరం కృషి చేస్తున్నారు.

యువతకు ఏడాదికాలంలోనే 55,143 ఉద్యోగాలు ఇచ్చి రికార్డు సృష్టించారు.  సంక్షేమ కార్యక్రమాల కోసం ఏడాది కాలంలో కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రూ.61,194 కోట్లు ఖర్చు చేసింది. ఇచ్చిన మాట ప్రకారం రైతులకు రూ. 2 లక్షలు రుణమాఫీ చేసింది. రాష్ట్రంలోని 25.36 లక్షల మంది రైతులకు రూ.20,677  కోట్లు రుణమాఫీ కోసం చెల్లించింది. 

Also Read : అపర భగీరథుడు కోమటిరెడ్డి

పెట్టుబడి సాయంగా రైతులకు రూ.7,625 కోట్లు, రైతులకు పవర్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ కోసం రూ.11,141 కోట్లు, రైతు బీమా కోసం రూ.1,514 కోట్లు, రైస్‌‌‌‌‌‌‌‌ సబ్సిడీ కోసం రూ.1,647 కోట్లు కింద మొత్తం రైతులకు సంవత్సరకాలంలో రూ.57వేల కోట్లు ఖర్చు చేసి రైతు ప్రభుత్వంగా కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ నిరూపించుకుంది. 

సన్న వడ్లకు ప్రతి క్వింటాకు  బోనస్‌‌‌‌‌‌‌‌ కింద రూ.500లు ప్రభుత్వం చెల్లిస్తున్నది. దీని కారణంగా రైతులకు ఎకరాకు రూ. 12వేల నుంచి రూ.15 వేల వరకు లబ్ధి చేకూరుతున్నది.  రికార్డు స్థాయిలో దేశ చరిత్రలో ఏ ప్రభుత్వం చెయ్యని విధంగా రూ.2 లక్షలు రుణమాఫీ చేసింది. 

అలాగే రాష్ట్రంలో ప్రభుత్వం కులగణన చేపట్టింది. ఈ కులగణన దేశానికే దిక్సూచిగా మారుతుందనడంలో సందేహం లేదు. రాష్ట్రంలోని ఒక్కో నియోజకవర్గానికి 3,500 చొప్పున ఇందిరమ్మ ఇండ్ల నిర్మాణానికి అనుమతులు మంజూరు చేసింది. రాబోయే నాలుగేండ్లలో 20 లక్షల ఇండ్లు నిర్మించాలని ప్రభుత్వం టార్గెట్‌‌‌‌‌‌‌‌గా పెట్టుకున్నది.

సమగ్ర అభివృద్ధి దిశగా..

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, సికింద్రాబాద్‌‌‌‌‌‌‌‌, సైబరాబాద్‌‌‌‌‌‌‌‌ తరువాత ముచ్చర్లలో నాలుగో నగర నిర్మాణానికి రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.  ముచ్చర్లలో నెట్‌‌‌‌‌‌‌‌ జీరో సిటీని నిర్మించాలని నిర్ణయించింది.  పారిశ్రామికాభివృద్ధి కోసం కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రాష్ట్రాన్ని మూడు జోన్లుగా విభజించింది. రాష్ట్రంలో 16 పెద్ద ప్రాజెక్టులకు పెట్టుబడులు పెట్టాయి. వీటి ద్వారా 35,724 మందికి ఉపాధి లభించింది. ఇవేకాక  ఫార్మారంగంలో రూ.34వేల కోట్ల పెట్టుబడులకు ఒప్పందాలు జరుగుతున్నాయి.  

కాలుష్య కాసారంగా మారిన మూసీ పునరుజ్జీవ ప్రాజెక్టును ప్రభుత్వం చేపట్టింది. బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం సాగునీటి రంగంపై పదేండ్లలో రూ.1.81 లక్షల కోట్లు ఖర్చు చేసినా కొత్త ఆయకట్టు సృష్టించలేదు. కానీ, కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఈ ఆర్థిక సంవత్సరంలో రూ.10వేల కోట్లు ఖర్చు చేసి 6.5లక్షల ఎకరాలకు నీరందించటానికి నిర్ణయించింది.  

రైతులకు  మేలు చేసేలా 6 ప్రాజెక్టులను తక్షణం పూర్తి చేయడానికి చర్యలు ప్రారంభించింది. అదేవిధంగా, వచ్చే నాలుగేండ్లలో 30లక్షల ఎకరాలకు సాగునీరు అందించటానికి ప్రణాళికలు సిద్ధం చేసింది.  రాష్ట్రంలో ఇంటిగ్రేటెడ్‌‌‌‌‌‌‌‌ స్కూల్స్‌‌‌‌‌‌‌‌ నిర్మాణాన్ని ప్రభుత్వం చేపట్టింది. 25 ఎకరాల స్థలంలో 29 జిల్లాల్లో రూ.300కోట్ల ఖర్చుతో యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా రెసిడెన్షియల్‌‌‌‌‌‌‌‌ స్కూళ్లను ప్రభుత్వం చేపట్టింది. ఇక్కడ సకల సౌకర్యాలతో విద్యార్థులకు విద్య, నైపుణ్యాలను అందిస్తారు. 

మహిళా సాధికారతకు బాటలు

మహిళాభివృద్ధి కోసం ఇందిరా మహిళ శక్తి పథకం కింద 32 జిల్లాల్లో మహిళా సంఘాలకు సంచార మత్స్యదుకాణాలు ప్రభుత్వం మంజూరు చేయాలని నిర్ణయించింది. మహిళలను కోటీశ్వరులను చేయాలనే సంకల్పంతో మహిళా సంఘాల ద్వారా 60 బస్సులను కొనుగోలు చేయించాలని నిర్ణయించింది. 

మహిళా సంఘాల ద్వారా 4 వేల మెగావాట్ల సామార్థ్యం గల సోలార్‌‌‌‌‌‌‌‌ పవర్‌‌‌‌‌‌‌‌ ప్లాంట్లను ఏర్పాటు చేయించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్నది. రాష్ట్రంలో  రూ.110 కోట్లతో 22 ఇందిరా మహిళా శక్తి భవనాలను 8నెలల్లో పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు. అదేవిధంగా రాష్ట్రంలోని మహిళా స్వయం సహాయక సంఘాలకు ఐదేళ్లలో రూ. లక్ష కోట్లు వడ్డీ లేని రుణాలను అందించాలని ప్రభుత్వం నిర్ణయించింది. 

ఇండస్ట్రీస్​పై ఫోకస్​

2023–24 ఆర్థిక సంవత్సరంలో సింగరేణి కార్మికులకు లాభాల్లో వాటాగా రూ.796 కోట్లు చెల్లించింది.  ఇప్పటివరకు విదేశీ సంస్థ అయిన టెర్రాసిస్‌‌‌‌‌‌‌‌ చేతిలో ఉన్న ధరణి  నిర్వహణ బాధ్యతను స్వదేశీ సంస్థ అయిన జాతీయ సమాచార సంస్థ (ఎన్‌‌‌‌‌‌‌‌ఐసీ)కి రాష్ట్ర ప్రభుత్వం అప్పగించింది. రాష్ట్రంలో ప్రస్తుతం 15,700  మెగావాట్లుగా ఉన్న కరెంట్‌‌‌‌‌‌‌‌ డిమాండ్‌‌‌‌‌‌‌‌ను ఏడేండ్లలో  27వేల  మెగావాట్లకు చేరే అవకాశం ఉన్నది కనుక అందుకు తగినట్లుగా విద్యుత్‌‌‌‌‌‌‌‌ ఉత్పత్తి ప్రణాళికలను ప్రభుత్వం సిద్ధం చేసింది.  

ముఖ్యమంత్రి రేవంత్​ ఒకటికి పదిసార్లు కేంద్ర మంత్రులతో భేటీ అయి గడిచిన సంవత్సర కాలంలో రూ.50వేల కోట్ల విలువైన ప్రాజెక్టులు రాష్ట్రానికి తెచ్చారు.  ముఖ్యంగా డిఫెన్స్‌‌‌‌‌‌‌‌ ఎలివేటెడ్‌‌‌‌‌‌‌‌ కారిడార్ల కోసం 139 ఎకరాల రక్షణ భూమిని రేవంత్‌‌‌‌‌‌‌‌ రెడ్డి సాధించారు. 

జహీరాబాద్‌‌‌‌‌‌‌‌లో ఇండస్ట్రియల్‌‌‌‌‌‌‌‌ సిటీ కోసం రూ.2400 కోట్లు కేంద్రం మంజూరు చేసింది. ప్రజాభవన్‌‌‌‌‌‌‌‌లో ప్రజల నుంచి వినతులు స్వీకరించడంతోపాటుగా గాంధీభవన్‌‌‌‌‌‌‌‌లో వారానికి రెండు రోజులు మంత్రులు స్వయంగా హాజరై ప్రజల నుంచి వినతులు స్వీకరిస్తూ వారి సమస్యలను వెంటనే పరిష్కరిస్తున్నారు. ప్రతిపక్ష బీఆర్ఎస్​, బీజేపీలు ఎన్ని కుట్రలు పన్నినా.. సంక్షేమం, అభివృద్ధి జోడెడ్లుగా నడుస్తున్న కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వ పాలనను  ప్రజలు సంపూర్ణంగా స్వాగతిస్తున్నారు.

అప్పుల నుంచి అభివృద్ధి దిశగా రాష్ట్రం

బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం రాష్ట్ర ప్రజల నెత్తిన రూ.7 లక్షల కోట్ల అప్పులు రుద్ది దిగిపోయింది. ఈ అప్పులకు నెలకు రూ. 6వేల కోట్లకు పైగా మిత్తీలు ప్రభుత్వం కడుతున్నది. డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 2023 నుంచి నవంబర్‌‌‌‌‌‌‌‌ నెలాఖరు వరకు రాష్ట్ర ప్రభుత్వం రూ. 64,516 కోట్లు అసలు, వడ్డీ కలిపి కిస్తీలు చెల్లించింది. 

ఈ వడ్డీలు, కిస్తీలు రాష్ట్రాభివృద్ధికి అవరోధంగా మారాయి. అయినా కొత్తగా ఏర్పడిన కాంగ్రెస్‌‌‌‌‌‌‌‌ ప్రభుత్వం ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఒకటో తేదీన ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తున్నది.  భారీ వర్షాల కారణంగా పంట నష్టపోయిన రైతులకు ఎకరాకు రూ. 10వేలు చొప్పున సుమారు రూ.100కోట్లు నష్టపరిహారం చెల్లించింది. 

రాజీవ్‌‌‌‌‌‌‌‌ ఆరోగ్యశ్రీ పథకానికి రూ.890 కోట్లు, రూ.500లకే  గ్యాస్‌‌‌‌‌‌‌‌ సిలిండర్‌‌‌‌‌‌‌‌  పథకానికి రూ.442 కోట్లు, 200 యూనిట్ల ఉచిత విద్యుత్‌‌‌‌‌‌‌‌ పథకానికి రూ.1234 కోట్లు, స్కాలర్‌‌‌‌‌‌‌‌ షిప్‌‌‌‌‌‌‌‌లు, డైట్‌‌‌‌‌‌‌‌ ఛార్జీల కోసం రూ. 1016 కోట్లు, మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణానికి రూ. 1375 కోట్లు, కల్యాణలక్ష్మి, షాదీముబారక్‌‌‌‌‌‌‌‌ పథకానికి రూ. 2,311 కోట్లు ఖర్చు చేసింది. ఇదేగాక, బీసీ, మైనారిటీలు, ఎస్సీ, ఎస్టీల సంక్షేమం కోసం దాదాపు రూ. 9,888 కోట్లు ఈ ఏడాది కాలంలో ప్రభుత్వం ఖర్చు చేసింది. 

కాళేశ్వరం నీళ్లు లేకుండానే ..153 లక్షల టన్నుల వరి దిగుబడి

వరి సాగులో తెలంగాణ దేశంలోనే మొదటి స్థానంలో నిలిచింది.  గడిచిన వానాకాలంలో 66.7లక్షల ఎకరాల్లో వరి సాగు జరగగా, 153 లక్షల టన్నుల దిగుబడి వచ్చింది. 

కాళేశ్వరం కారణంగానే వరిలో అధిక దిగుబడి సాధ్యమైందని ఇన్నాళ్లు బీఆర్‌‌‌‌‌‌‌‌ఎస్‌‌‌‌‌‌‌‌ నాయకులు సాగించిన ప్రచారం అబద్ధమని దీనితో తేలిపోయింది. కాళేశ్వరం కూలిపోయి నీటిని నిల్వ చేసే పరిస్థితి లేకపోయినా, రికార్డు స్థాయిలో వరి దిగుబడి రాష్ట్రం సాధించింది. విద్యార్థులలో నైపుణ్యాన్ని పెంపొందించడానికి యంగ్‌‌‌‌‌‌‌‌ ఇండియా స్కిల్‌‌‌‌‌‌‌‌ యూనివర్సిటీని ప్రభుత్వం 57 ఎకరాల విస్తీర్ణంలో  నిర్మిస్తున్నది. 

- బోరెడ్డి అయోధ్యరెడ్డి, సీపీఆర్‌‌‌‌‌‌‌‌ఓ, తెలంగాణ ముఖ్యమంత్రి-