వరంగల్​ జిల్లాలో పథకాల పండుగ

వరంగల్​ జిల్లాలో పథకాల పండుగ

 నెట్​వర్క్​వెలుగు :  తెలంగాణ కాంగ్రెస్​ ప్రభుత్వం ఆదివారం పథకాల పండుగ ప్రారంభించింది. ఉమ్మడి వరంగల్​ జిల్లా వ్యాప్తంగా ఇందిరమ్మ ఇండ్లు, ఇందిరమ్మ ఆత్మీయ భరోసా, ఇందిరమ్మ రైతు భరోసా, కొత్త రేషన్​ కార్డుల పత్రాలను లబ్ధిదారులకు అందజేయడంతో సంబురంగా చిందులు వేశారు. మహబూబాబాద్​ జిల్లా కేసముద్రం మండలం గాంధీనగర్​లో మహబూబాబాద్​ ఎమ్మెల్యే మురళీనాయక్, సీఎం సలహాదారు వేం నరేందర్​రెడ్డి, ఎంపీ బల్​రాం నాయక్, కలెక్టర్​ అద్వైత్​ సింగ్ పాల్గొని నాలుగు పథకాలకు సంబంధించిన లబ్ధిదారులకు పత్రాలను అందజేశారు. నర్సింహులపేట మండలం వంతడపలలో లబ్ధిదారులకు పత్రాలను అందజేస్తున్న ప్రభుత్వ విప్, డోర్నకల్​​ఎమ్మెల్యే రాంచంద్రు నాయక్, హనుమకొండ జిల్లా ఎల్కతుర్తి మండలం వీరనారాయణపూర్ ను పైలట్ ప్రాజెక్టు గా ఎంపిక చేయగా కుడా చైర్మన్ ఇనుగాల వెంకట్రామిరెడ్డి సంక్షేమ పథకాలను ప్రారంభించారు. 

 వరంగల్​ జిల్లా రాయపర్తి మండలం మహబూబ్​నగర్​లో మంజూరు పత్రం అందిస్తున్న ఎమ్మెల్యే యశస్వినిరెడ్డి, జనగామ జిల్లా స్టేషన్​ఘన్​పూర్​ మండలం తానేదార్​పల్లిలో ఎమ్మెల్యే కడియం శ్రీహరి, జయశకంర్​ భూపాలపల్లి జిల్లా మొగుళ్లపల్లి మండలం అంకుషాపురం హనుమకొండ జిల్లా శాయంపేట మండలం గట్లకానిపర్తిలో భూపాలపల్లి ఎమ్మెల్యే గండ్ర సత్యనారాయణరావు లబ్ధిదారులకు మంజూరు పత్రాలు పంపిణీ చేశారు.   -