లోక్‌సభ ఎన్నికల వేళ తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. మే 03వ తేదీ శుక్రవారం ఉదయం 11 గంటలకు మేనిఫెస్టోను రిలీజ్ చేసింది. కేంద్రంలో కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రాష్ట్రానికి ఏం చేస్తామో మేనిఫెస్టోలో వివరించింది. హైదరాబాద్ కు బీజేపీ రద్దు చేసిన ఐటీఐఆర్ ను పున: ప్రారంభిస్తామని తెలిపింది. పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టుకు , మేడారం సమ్మక్క సారక్క జాతరకు జాతీయ హోదా తీసుకువస్తామని హామీ ఇచ్చింది. నాలుగు నూతన సైనిక్ స్కూల్స్ ఏర్పాటు చేస్తామని కాంగ్రెస్ హామీలలో ప్రకటించింది. కాగా ఇప్పటికే జాతీయ స్థాయిలో కాంగ్రెస్ పార్టీ న్యాయ్ పత్ర పేరుతో మ్యానిఫెస్టోను విడుదల చేసిన సంగతి తెలిసిందే.
తెలంగాణ కాంగ్రెస్ స్పెషల్ మేనిఫెస్టోలోని అంశాలు