తెలంగాణ కాంగ్రెస్​ ఇంచార్జి మీనాక్షి నటరాజన్​కు ఘనస్వాగతం

తెలంగాణ కాంగ్రెస్​ ఇంచార్జి మీనాక్షి నటరాజన్​కు ఘనస్వాగతం

తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇంచార్జి మీనాక్షి నటరాజన్ (Meenakshi Natarajan) తొలిసారిగా రాష్ట్రానికి వచ్చారు.  ఆమెకు కాచిగూడ రైల్వే స్టేషన్​ లో  టీపీసీసీ చీఫ్​ మహేష్​ కుమార్​ గౌడ్​ తో సహా ఇతర కాంగ్రెస్ నాయకులు ఘన స్వాగతం పలికారు . ఈరోజు (ఫిబ్రవరి 28వ తేదీన)  గాంధీభవన్ లో పీసీసీ చీఫ్(TPCC Chief) బి.మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud)అధ్యక్షతన జరుగనున్న టీపీసీసీ విస్త్రృత స్థాయి సమావేశానికి మీనాక్షి నటరాజన్ హాజరవుతారు. సీఎం రేవంత్ రెడ్డితో పాటు మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు కూడా సమావేశానికి హాజరుకానున్నారు. 

తెలంగాణ కాంగ్రెస్​ ఇంచార్జి మీనాక్షి నటరాజ్ మాట్లాడుతూ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని రాజ్యాంగ విలువలను పరిరక్షిస్తానని పేర్కొన్నారు. పీసీసీ అధ్యక్షుడు , ముఖ్యమంత్రి సహకారంతో తెలంగాణలో పార్టీ బలోపేతం చేస్తానని ఆమె తెలిపారు.