జనవరి 8న గాంధీ భవన్లో పీఏసీ సమావేశం

జనవరి 8న గాంధీ భవన్లో పీఏసీ సమావేశం

హైదరాబాద్, వెలుగు: పీసీసీ పొలిటికల్ ఎఫైర్స్ కమిటీ (పీఏసీ) సమావేశం ఈ నెల 8న గాంధీభవన్ లో నిర్వహించనున్నారు. ఏఐసీసీ ఇన్ చార్జ్ ప్రధాన కార్యదర్శి దీపాదాస్ మున్షీ అధ్యక్షతన జరుగనున్న మీటింగ్ కు ఏఐసీసీ ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్) కేసీ వేణుగోపాల్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు. ఈ సమావేశంలో సీఎం రేవంత్ రెడ్డి, పీసీసీ అధ్యక్షుడు మహేశ్ కుమార్ గౌడ్, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్కతో పాటు 23 మంది పీఏసీ సభ్యులు పాల్గొననున్నారు.