ప్రభుత్వ తీరుపై గవర్నర్కు కాంగ్రెస్ నేతల ఫిర్యాదు

హైదరాబాద్: రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిశారు కాంగ్రెస్ నాయకులు. నిరుద్యోగం, 111జీవో, పంట అమ్మిన రైతులకు నష్ట పరిహారం, విద్యుత్ చార్జీల పెంపు, డ్రగ్స్, మూసీ కాలుష్యంపై గవర్నర్ కు ఫిర్యాదు చేశారు. అంతకుముందు సీఎల్పీ  కార్యాలయంలో భేటీ అయ్యారు. అక్కడి నుంచి నేరుగా రాజ్ భవన్ కు వెళ్లి గవర్నర్ తమిళిసై సౌందరరాజన్ ను కలిశారు. పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, స్టార్ క్యాంపెయినర్, ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి, సంగారెడ్డి ఎమ్మెల్యే జగ్గారెడ్డి, మాజీ ఎంపీలు అంజన్ కుమార్ యాదవ్, రేణుకా చౌదరి, పొన్నం ప్రభాకర్, మధుయాష్కీ, మాజీమంత్రులు షబ్బీర్ అలీ, గీతారెడ్డి, జాతీయ కిసాన్ సెల్ అధ్యక్షుడు కోదండరెడ్డి, దాసోజు శ్రవణ్ ఇతర ముఖ్య నాయకులందరూ కలసి రాజ్ భవన్ కు వెళ్లారు. 
వడ్ల కొనుగోళ్ల విషయంలో ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు నష్టం జరిగిందన్నారు కాంగ్రెస్ నేతలు. ప్రభుత్వం కొనకపోవడంతో ప్రైవేట్ గా 40శాతం మంది పంట అమ్ముకున్నారని గవర్నర్ కు చెప్పారు. ముందు పంట అమ్ముకున్న రైతుల ఖాతాల్లో ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించేలా ఆదేశించాలని కోరారు. 111జీవోపై అఖిలపక్షం వేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం డిస్కంలకు బకాయిలు ఉండి.. విద్యుత్ చార్జీలు పెంచి ప్రజలపై భారం వేస్తోందన్నారు. 111జీవోపై రివ్యూ జరపడంతో పాటు.. డ్రగ్స్, శాంతిభద్రతలపై సమీక్ష చేయాలని గవర్నర్ ను కోరారు కాంగ్రెస్ నేతలు. 

 

 

ఇవి కూడా చదవండి

నీళ్లు ఇవ్వకుంటే మూత్రం తాగేసే వాళ్లం

ఏపీలో రేషన్ కార్డు దారులకు శుభవార్త

మహిళల భద్రత కోసం కర్ణాటకలో నెలంతా సేఫ్టీ రైడ్

జంక్ ఫుడ్ ఎక్కువ తినడం వల్ల కొలరెక్టల్‌‌ క్యాన్సర్‌‌‌‌!

ఎక్కువ కాల్షియాన్ని అందించే ఫుడ్స్​ ఇవే..