
కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కూల్చుతామంటే చూస్తూ ఊరుకోం అని.. ఇక్కడ ఎవరూ చేతులు కట్టుకుని కూర్చోలేదంటూ స్ట్రాంగ్ వార్నింగ్ ఇస్తున్నారు కాంగ్రెస్ పీసీసీ చీఫ్, ఇతర మంత్రులు. పదేళ్లలో బీఆర్ఎస్ ప్రభుత్వం ఎంత అవినీతి చేసిందో.. ఎంత దోచుకుందో.. కాంట్రాక్టర్ల పేరుతో తెలంగాణ జనం సొమ్మును ఏ విధంగా లూటీ చేసిందో అనటానికి.. కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలే నిదర్శనం అంటూ దుమ్మెత్తిపోశారు కాంగ్రెస్ లీడర్లు. దుబ్బాక బీఆర్ఎస్ ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ తోపాటు మంత్రులు, ఎమ్మెల్యే స్పందించారు. వారి మాటల్లోనే...
హైదరాబాద్: కాంగ్రెస్ పాలనతో విసుగు చెందిన బిల్డర్లు, పారిశ్రామిక వేత్తలు ప్రభుత్వాన్ని పడగొట్టాలంటున్నారని దుబ్బాక ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై కాంగ్రెస్ మంత్రులు, నేతలు కౌంటర్ ఇచ్చారు. ఈ వ్యాఖ్యలపై కాంగ్రెస్ పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ స్పందిస్తూ.. చోటామోటా కాంట్రాక్టర్లు కూల్చితే కూలే ప్రభుత్వం కాదని, ఎమ్మెల్యేల సంపూర్ణ మద్దతు తనకు ఉందని చెప్పారు. చోటామోటా బ్యాచ్కి భయపడమని, బీఆర్ఎస్ పదేండ్లు యథేచ్ఛగా దోచుకుందని ఆయన మండిపడ్డారు. బీఆర్ఎస్ కు అమ్ముడు, కొనుగోలుపై అనుభవం ఉందని, ఎమ్మెల్యేలు సంతలో పశువులు కాదని పీసీసీ చీఫ్ కౌంటర్ ఇచ్చారు. ఎమ్మెల్యేలపై బీఆర్ఎస్ నేతలకు కనీస గౌరవం లేదని, డబ్బులకు అమ్ముడు పోయే ఎమ్మెల్యేలని బీఆర్ఎస్ అంటోందని, ప్రభుత్వ పెద్దలతో చర్చించి కొత్త ప్రభాకర్ వ్యాఖ్యలపై తగిన నిర్ణయం తీసుకుంటామని పీసీసీ చీఫ్ మహేశ్ గౌడ్ చెప్పారు.
కొత్త ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు.. కేసీఆర్ వాక్యాలు: మంత్రి పొంగులేటి
* కేసీఆర్ తన వ్యాఖ్యలనే.. తన ఆత్మ కొత్త ప్రభాకర్ రెడ్డితో మాట్లాడించారు
* ప్రభుత్వాన్ని పడగొట్టే కుట్ర జరుగుతుంది.. దీనిపై విచారణ జరిపే ఆలోచన చేస్తాం
* కొత్త ప్రభాకర్ రెడ్డి సొంతంగా మాట్లాడారని అనుకోవడం లేదు
* వేల కోట్లతో రాజకీయం చేయాలని బీఆర్ఎస్ చూస్తున్నది
* ఎప్పుడు వేసే పాత క్యాసెట్నే తిరిగి బీఆర్ఎస్ వేస్తోంది
కొత్త ప్రభాకర్కి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందేమో: మంత్రి పొన్నం ప్రభాకర్
* కొత్త ప్రభాకర్కి ట్రాన్స్పోర్ట్ బిజినెస్ ఉందేమో
* కొత్త ప్రభాకర్కి జోతిష్యం తెలుసు మాకు తెలీదు
* ప్రభుత్వాన్ని పడగొట్టాలని చూస్తే చూస్తూ ఊరుకోం
* పడగొడదాం రండీ అంటే పోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు
కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేపించాలి: ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్
* కొత్త ప్రభాకర్ రెడ్డికి నార్కో అనాలసిస్ టెస్ట్ చేపించాలి
* బీజేపీతో కలిసి గుజరాత్ వ్యాపారులతో కలిసి బీఆర్ఎస్ కుట్ర చేస్తుంది
* సిగ్గుశరం లేకుండా ఏది పడితే అది మాట్లాడ్తున్నారు
* విచారణ చేయాలి.. నిజాలు చెప్పించాలి