![కాంగ్రెస్ మేనిఫెస్టో : తేదీలతో సహా జాబ్ క్యాలెండర్ ప్రకటన](https://static.v6velugu.com/uploads/2023/11/telangana-congress-party-release-job-calendar-in-manifesto_LQ725JZ00d.jpg)
తెలంగాణ కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. 42 పేజీలు ఉన్నాయి. ఇందులో ముఖ్యంగా ప్రస్తావించాల్సింది.. నిరుద్యోగులకు జాబ్ క్యాలెండర్. ఎప్పుడెప్పుడు.. ఏయే తేదీల్లో నోటిఫికేషన్లు ప్రకటించేది వివరించింది కాంగ్రెస్ మేనిఫెస్టో.
2024, ఫిబ్రవరి ఒకటో తేదీన గ్రూప్ వన్ నోటిఫికేషన్ విడుదల చేయబోతున్నట్లు ప్రకటించగా.. ఏప్రిల్ ఒకటిన గ్రూప్ 2 నోటిఫికేషన్ విడుదల కానున్నట్లు తేదీలతో సహా వెల్లడించింది మేనిఫెస్టో. జూన్ ఒకటో తేదీన గ్రూప్ 3, అదే తేదీన గ్రూప్ 4 నియామకాలకు నోటిఫికేషన్ రానుంది. ఫేస్ వన్, ఫేస్ 2 కింద.. అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే 2 లక్షల ఉద్యోగాలను పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నియామకాలు ఉంటాయని మేనిఫెస్టోలో స్పష్టంగా వెల్లడించటం విశేషం.
జాబ్ క్యాలండర్ ఇలా ఉంది..