
టీపీసీసీ సమావేశంలో పాల్గొన్న రాష్ట్ర వ్యవహారాల ఇంచార్జ్ మీనాక్షి నటరాజన్ కీలక వ్యాఖ్యలు చేశారు. వంద సంవత్సరాల క్రితం గాంధీ కాంగ్రెస్ అధ్యక్ష పదవి సవీకరించిన రోజు అని అన్నారు. స్వాతంత్య్ర పోరాడింది కాంగ్రెస్సే.. దేశాన్ని కాపాడేది కాంగ్రెస్సే అని అన్నారు. రాజ్యాంగ పరిరక్షణ కోసమే రాహుల్ గాంధీ భారత్ జోడో యాత్ర చేశారని అన్నారు. ఈ ప్రభుత్వం కాంగ్రెస్ కార్యకర్తల త్యాగంతో ఏర్పడిందని.. సామాజిక న్యాయం కోసం, మార్పు కోసం పార్టీ కార్యకర్తలు కష్టపడ్డారని అన్నారు. మార్పు కోసం కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిందని అన్నారు.
ప్రతి కార్యకర్త పేద వాడి కోసం పని చేయాలని.. పేదల మొఖంలో నవ్వులు చూడాలని.. అప్పుడే మనం పని చేసినట్టని అన్నారు మీనాక్షి. రాహుల్ గాంధీ రాజ్యాంగ రక్షణ కోసం భారత్ జొడో యాత్ర నిర్వహించి ఒక మైదానాన్ని తయారు చేశారని.. మనం దాని కోసం పోరాటం చేయాలని అన్నారు. బీజేపీ, బిఆర్ఎస్ పార్టీలతో మనం పోరాటం చేయాల్సి ఉందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ దేశం కోసం పోరాటం చేసి స్వాతంత్రాన్ని తెచ్చిందని.. కాంగ్రెస్ ఎలాంటి పోరాటానికి అయిన సిద్ధంగా ఉందని అన్నారు.
రాష్ట్రంలో సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అనేక కార్యక్రమాలు చేపట్టిందని.. ఇవన్నీ ప్రజలకు సక్రమంగా అందాలని అన్నారు. పదేళ్లుగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఎంతో కష్టపడి పని చేసారని.. వారికి న్యాయం జరగాలని అన్నారు.పదవులు పొందినవారు ప్రజల కోసం పని చేయాలని అన్నారు.
దేశంలో ఎక్కడా లేని విదంగా తెలంగాణలో కులగణన చేపట్టామని.. ఇది చాలా గొప్ప విషయమని అన్నారు.గ్రామ గ్రామానికి వెళ్లి జై బాపు, జై భీమ్, జై సంవిధాన్ కార్యక్రమాలను పెద్ద ఎత్తున చేపట్టాలని అన్నారు. గ్రామ గ్రామన పార్టీ కార్యక్రమాలను విస్తృతంగా చేపట్టాలని..ఈ విషయంలో పీసీసీ పకడ్బందీగా కాలెండర్ సిద్ధం చేయాలని అన్నారు మీనాక్షి నటరాజన్.