ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న, అలియాస్ చింతపండు నవీన్ కుమార్ కు కాంగ్రెస్ క్రమశిక్ష కమిటీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది. బీసీల అంశంలో పార్టీ లైన్ దాటి వ్యాఖ్యలు చేశారని మల్లన్నపై అభియోగాలు ఉన్నాయి. ఈ క్రమంలోనే వివరణ ఇవ్వాలంటూ పార్టీ షోకాజ్ నోటీసులు జారీ చేసింది.
ఇటీవల వరంగల్ లో జరిగిన బీసీల బహిరంగ సభలో కులగణన సర్వే, రెడ్డి సామాజిక వర్గాన్ని కించపరుస్తూ తీన్మార్ మల్లన్న అనుచిత వ్యాఖ్యలు చేశారు. కులగణనలో బీసీల సంఖ్యను తక్కువ చేసి చూపించారని వ్యాఖ్యానించారు. అంతేగాకుండా రెడ్డి సామాజిక వర్గంపై జుగుప్సాకర వ్యాఖ్యలు చేశారు. ఈ వ్యాఖ్యలు తెలంగాణ వ్యాప్తంగా దుమారం రేపుతున్నాయి. మల్లన్న తన ఎమ్మెల్సీ పదవికి రాజీనామా చెయ్యాలని..క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నారు. తీన్మార్ మల్లన్నపై చర్యలు తీసుకోవాలని రెడ్డి సామాజిక వర్గం నేతలు రాష్ట్ర వ్యాప్తంగా ఫిర్యాదు చేస్తున్నారు.
Also Raed : కులగణనకు జనం జై కొట్టారు
కాంగ్రెస్ లో ఉన్న రెడ్డి సామాజిక వర్గం కూడా మల్లన్న వ్యవహారంపై ఆగ్రహంగా ఉన్నట్లు తెలుస్తోంది. మలన్న తన స్థాయికి మించి మాట్లాడుతున్నారని..పార్టీ లైన్ దాటి వ్యవహరిస్తున్నారని పలువురు సీనియర్ నేతలు పార్టీ అధిష్టానానికి ఫిర్యాదు కూడా చేశారని సమాచారం. ఈ వ్యవహారం కాస్త సీరియస్ కావడంలో కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఇవాళ( ఫిబ్రవరి 5న) తీన్మార్ మల్లన్నకు నోటీసులు ఇచ్చింది.