హైదరాబాద్ బుద్దభవన్ దగ్గర ఉద్రిక్తత నెలకొంది. మహిళా కమిషన్ ముందు విచారణకు హాజరయ్యేందుకు వచ్చిన కేటీఆర్ ను అడ్డుకునేందుకు యత్నిచారు మహిళా కాంగ్రెస్ నేతలు. మహిళలపై కేటీఆర్ చేసిన కామెంట్స్ మీద నిరసన తెలిపారు.
మహిళల ఫ్రీ బస్సు జర్నీపై కేటీఆర్ కామెంట్స్ ను తప్పుబట్టారు మహిళా కాంగ్రెస్ నేతలు. కేటీఆర్ కు వ్యతిరేకంగా మహిళా కాంగ్రెస్ నేతలు ఆందోళనకు దిగారు. కేటీఆర్ ట్విట్టర్ లో కాకుండా బహిరంగంగా మహిళలకు సారీ చెప్పాలని డిమాండ్ చేశారు. కేటీఆర్ కామెంట్స్ ను సుమోటోగా స్వీకరించిన ఉమెన్ కమిషన్...తమ ఎదుట హాజరుకావాలంటూ ఆగస్టు 16న నోటీసులిచ్చింది.
Also Read :- హీరో నాగార్జున N కన్వెన్షన్ కూల్చివేత
మహిళలు ఆర్టీసీ బస్సుల్లోబ్రేక్ డ్యాన్సులు, రికార్డింగ్ డ్యాన్సులు, కుట్లుఅల్లికలు ఇంకేమైనా చేసుకోవచ్చు అంటూ కేటీఆర్ కామెంట్స్ చేసిన సంగతి తెలిసిందే.. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా దుమారం రేగడంతో కేటీఆర్ తన ఎక్స్ లో క్షమాపణలు చెప్పారు. తెలంగాణ మహిళా కమిషన్ ఆగస్టు 24న విచారణకు హాజరుకావాలంటూ కేటీఆర్ కు నోటీసులు ఇచ్చింది. అయితే బహిరంగ క్షమాపణలు చెప్పాలంటూ మహిళలు డిామాండ్ చేస్తున్నారు.