- గతేడాదితో పోల్చితే 13 % పెరిగిన సేల్స్
హైదరాబాద్, వెలుగు: రాష్ట్ర వ్యాప్తంగా లిక్కర్ సేల్స్ భారీగా పెరిగాయి. గత ఏడాదితో పోలిస్తే ఈ ఏడాది అక్టోబర్‌లో మద్యం అమ్మకాలు13 శాతం ఎక్కువగా జరిగాయి. గతేడాది అక్టోబరు1 నుంచి14 వరకు రూ.1,140.94 కోట్ల లిక్కర్ సేల్స్ జరుగగా.. ఈ ఏడాది 14 రోజుల వ్యవధిలో రూ.1,285.16 కోట్లు సేల్ అయ్యాయి. ఇందులో లిక్కర్ 11,03,614 కేసులు, బీర్లు 20,63,350 కేసుల అమ్మకాలు జరిగాయి.