రాబోయే మూడు, నాలుగు రోజులు సైతం హైదరాబాద్ లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ హెచ్చరికలతో.. హైదరాబాద్ సిటీ పోలీసులు అలర్ట్ అయ్యారు. సెప్టెంబర్ 5 తేదీ పడిన భారీ వర్షానికి.. హైదరాబాద్ సిటీ రోడ్లు ట్రాఫిక్ తో నిండిపోయాయి. ఐదారు కిలోమీటర్ల దూరానికి గంటల కొద్దీ సమయం పట్టింది. రోడ్లపై నిలిచిన నీళ్లు.. నీట మునిగిన కాలనీలతో గందరగోళం ఏర్పడింది. ఈ క్రమంలోనే రాబోయే నాలుగు రోజులకు వాతావరణ శాఖ ఇచ్చిన హెచ్చరికలతో.. హైదరాబాద్ పోలీసులు అప్రమత్తం అయ్యారు.
ముఖ్యంగా హైటెక్ సిటీ, ఇతర ఐటీ కంపెనీలు ఉన్న ఏరియాల్లో ట్రాఫిక్ జాం ఏర్పడకుండా.. అవకాశాన్ని బట్టి.. ఐటీ ఉద్యోగులు అందరూ ఇళ్ల దగ్గరే ఉండి పని చేసుకోవాలని.. ఈ మేరకు కంపెనీలు... ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం అవకాశం కల్పించాలని ఆయా కంపెనీల యజమానులను కోరారు. కూకట్ పల్లి, కేపీహెచ్ బీ. ప్రగతినగర్, గచ్చిబౌలి, నిజాంపేట, మియాపూర్, హైటెక్ సిటీ, కొండాపూర్, మాదాపూర్ ప్రాంతాల్లో భారీ వర్షాలకు ట్రాఫిక్ జాం ఏర్పడుతుంది. దీన్ని నివారించేందుకు ఐటీ ఉద్యోగులకు వర్క్ ఫ్రమ్ హోం ఇవ్వాలని హైదరాబాద్ సిటీ పోలీసులు పిలుపునిచ్చారు.
రాష్ట్ర వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్నాయి. అత్యవసర పరిస్థితుల్లో తప్పితే ప్రజలు ఇంటి నుండి బయటకు రాకూడదు. ఐటి ఉద్యోగులు Work From Home చేసుకోవాలి. అత్యవసర ఉద్యోగులు ఆఫీస్ నుండి ఇంటికి వర్షాభావపరిస్థితిని బట్టి బయలుదేరాలి. pic.twitter.com/s1FD2870nV
— Telangana State Police (@TelanganaCOPs) September 5, 2023