
- సీఎం రేవంత్ రెడ్డికి మండలి చైర్మన్ గుత్తా లేఖ
హైదరాబాద్, వెలుగు: రాష్ట్రంలో ‘మన ఊరు.. మన బడి’ పథకం కింద భవనాలు నిర్మించిన కాంట్రాక్టర్లకు వెంటనే బిల్లులు చెల్లించాలని శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి కోరారు. కాంట్రాక్టర్లకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలు ఇప్పటి వరకు అందలేదని తెలిపారు.
ఇంత వరకు బకాయిలు చెల్లించకపోవడంతో చాలా మంది కాంట్రాక్టర్లు తమ ఆస్తులు అమ్ముకోవాల్సి వస్తోందని, బయట వడ్డీలకు అప్పులు తీసుకురావాల్సిన పరిస్థితి ఏర్పడిందని అందులో పేర్కొన్నారు. ఇప్పటికే రూ.700 కోట్లను కాంట్రాక్టర్లకు ప్రభుత్వం చెల్లించాల్సి ఉందని, ఈ భవనాల నిర్మాణం పూర్తయ్యేందుకు మరో రూ. 300 కోట్లు అవసరమని, మొత్తం రూ. వెయ్యి కోట్లు విడుదల చేయాలని ఆ లేఖలో మండలి చైర్మన్ కోరారు.