
హుస్నాబాద్, వెలుగు : తెలంగాణ దశాబ్ది ఉత్సవాల పేరుతో మటన్, చికెన్ పెట్టి ప్రజలను మాయచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ నేత అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి విమర్శించారు. ‘పల్లె పల్లెకు ప్రవీణన్న, గడప గడపకు కాంగ్రెస్’ పేరుతో ఆయన చేపట్టిన పాదయాత్ర మంగళవారం అక్కన్నపేట మండలం ధర్మారానికి చేరుకుంది.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేసీఆర్ ఎన్ని మాయలు చేసినా ప్రజలు నమ్మే పరిస్థితుల్లో లేరన్నారు . ఓ వైపు రైతులకు సంకెళ్లు వేస్తూ.. మరో వైపు సంబురాలు చేస్తున్నారని మండిపడ్డారు. తాను ఎమ్మెల్యేగా ఆర్డీవో ఆఫీసు, పాలిటెక్నిక్ కాలేజీ, ఆస్పత్రి ఆధునీకరణ పనులు మొదలుపెట్టానని గుర్తుచేశారు. ఎమ్మెల్యే సతీశ్‌కుమార్ హరీశ్‌రావు, కేటీఆర్ గురించి గొప్పలు చెప్పడం తప్ప చేసిందేమీ లేదని విమర్శించారు. ఆయన వెంట టీపీసీసీ మెంబర్ కేడం లింగమూర్తి, సొసైటీ చైర్మన్ బొలిశెట్టి శివయ్య, నేతలు బంక చందు, ఐలయ్య, సంజీవరెడ్డి, రాజిరెడ్డి ఉన్నారు.