ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో తాగునీటి కొరత ఏర్పడిన తరుణంలో నాగార్జునసాగర్ ప్రాజెక్టు నుంచి 11.769 టీఎంసీల నీళ్లు ఇవ్వాలని తెలంగాణ కోరుతున్నది. క్యారీ ఓవర్ జలాల్లో 27 టీఎంసీలు తెలంగాణకు రావాల్సి ఉన్నదని, అందులో నుంచి తాగేందుకు నీళ్లివ్వాలని కోరుతూ గత నెలలో ఇరిగేషన్ సెక్రటరీ రాహుల్ బొజ్జా కేఆర్ఎంబీకి లేఖ రాశారు. అయితే, తెలంగాణ వాటా నీళ్లను వాడుకున్నదని పేర్కొంటూ బోర్డు రిప్లై ఇచ్చింది.
మరోవైపు ఈ నెల 8వ తేదీ నుంచి 5 టీఎంసీల నీళ్లను విడతలవారీగా విడుదల చేసేందుకు అనుమతివ్వాలని కోరుతూ ఏపీ లేఖ రాసింది. ఈ నేపథ్యంలోనే గురువారం కేఆర్ఎంబీ సమావేశాన్ని ఏర్పాటు చేసినా.. రాలేమంటూ 2 రాష్ట్రాలు సమాధానమిచ్చాయి. నెక్స్ట్ మీటింగ్ ఎప్పుడు ఉంటుందనే దానిపై మాత్రం క్లారిటీ లేదు.