భట్టికి సత్తా ఉంది కాబట్టే ఆయనకు ఆ శాఖలు: మంత్రి తుమ్మల

తెలంగాణ ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్కకు  సమర్దవంతంగా పనిచేసే సత్తా ఉందని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  ఖమ్మంలో ముగ్గురు మంత్రులకు ( భట్టి విక్రమార్క, పొంగులేటి శ్రీనివాసరెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు) .. కాంగ్రెస్​ పార్టీ కార్యకర్తలు.. అభిమానులకు ఘన స్వాగతం పలికారు.  భట్టి సమర్ధుడైన వ్యక్తి కాబట్టే ఆయనకు ఆర్థికశాఖ, ఇందన శాఖ  కేటాయించారన్నారు. విక్రమార్క, పొంగులేటి సహకారంలో ఖమ్మం నియోజకవర్గంలో ఎటువంటి అక్రమాలు లేకుండా... కబ్జాలు లేకుండా చేస్తానని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.  సీతారామ ప్రాజెక్ట్​ పూర్తిచేసి ఖమ్మంజిల్లా ప్రజలకు స్వచ్చమైన తాగునీరు  పూర్తిగా కల్పించేలా కృషి చేస్తానని తుమ్మలన్నారు..ఖమ్మం ప్రజల కాళ్ళు కడిగి నెత్తిన పోసుకున్నా ఋణం తీర్చుకోలేమని మంత్రి తుమ్మల నాగేశ్వరావు అన్నారు.

కాంగ్రెస్​ ఆరు గ్యారంటీలపై మాట్లాడుతూ..  ప్రభుత్వం ఏర్పడిన రెండు రోజులకే  రెండు గ్యారంటీలు అమల్లోకి వచ్చాయన్నారు. మిగతా వాటిని తల తాకట్టుపెట్టైనా 100 రోజుల్లో పూర్తిచేస్తామన్నారు.   తన రాజకీయ జీవితం 40 ఏళ్ళని.. భట్టి విక్రమార్క మళ్ళీ తనకు 5 ఏళ్ళు ఇచ్చారని తెలిపారు. గతంలో కొందరు తలమాసిన వ్యక్తుల వలన తప్పులు జరిగాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. తప్పుడు కేసులు, ఆక్రమణలు ఉంటే వాటిని సరి చేసుకోవాలని సూచించారు. సీపీ, కలెక్టర్ తెలంగాణలోనే ఉంటారని ప్రజల కోసం పని చేయాలని మంత్రి తెలిపారు.