ప్రియాంక గాంధీపై బీజేపీ నాయకుల వ్యాఖ్యలు సరికాదని, తీవ్రంగా ఖండింస్తున్నామని ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అన్నారు. బీజేపీ నాయకుల వ్యాఖ్యలను భారతీయ సంస్కృతి పైన, స్త్రీల పైన గౌరవం ఉన్నవాళ్లు ఖండించాలని పిలుపునిచ్చారు. ఎర్రుపాలెం మండలం వెంకటాపురంలో మీడియా సమావేశంలో మాట్లాడుతూ.. బీజేపీ నాయకులు చేసిన తీవ్రమైన కామెంట్స్ పై భట్టి మండిపడ్డారు. అదే విధంగా బీజేపీ కార్యాలయంపై యూత్ కాంగ్రెస్ నాయకుల దాడిపై సీరియస్ అయ్యారు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిరసనలు ఉండాలని సూచించారు.
యూత్ కాంగ్రెస్ దాడులు తమకు ఎవరికీ తెలియదని, దాడులు కాంగ్రెస్ పార్టీ సంస్కృతి కాదని డిప్యూటీ సీఎం అన్నారు. యూత్ కాంగ్రెస్ ఇలా ఒక రాజకీయ పార్టీ కార్యాలయంపైన దాడికి వెళ్లడం సరైంది కాదని మండిపడ్డారు. అహింస మార్గంలో బహిరంగంగా మాట్లాడటమే కానీ.. భౌతిక దాడులకు పాల్పడటం కాంగ్రెస్ పార్టీ సిద్ధాంతం కాదని తెలిపారు.
ALSO READ | కేటీఆర్ ఓ బచ్చా.. కేసీఆర్ ఒక దుర్మార్గుడు: షబ్బీర్ అలీ ఫైర్
బీజేపీ నేతలు కూడా ఇలా దాడులు చేయడం సరైంది కాదని అన్నారు. బీజేపీ నేతల తీరును తీవ్రంగా ఖండిస్తున్నట్లు తెలిపారు. శాంతి భద్రతల విషయంలో బీజేపీ నాయకులు సహకరించాలని కోరారు. ప్రజల మాన, ప్రాణాలు కాపాడే పార్టీ కాంగ్రెస్ పార్టీ అని, రాష్ట్రలో, దేశంలో ఏ పార్టీల వారైనా దాడులకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ప్రియాంక గాంధీపై ఢిల్లీ బీజేపీ కాల్కాజీ ఎమ్మెల్యే అభ్యర్థి రమేష్ బిధూరి చేసిన వ్యాఖ్యలు తీవ్రమైనవని ఖండించారు.