
‘మల్లేశం’ చిత్రంతో మెప్పించిన దర్శకుడు రాజ్ ఆర్ తెరకెక్కిస్తున్న చిత్రం ‘23’. రియల్ ఇన్సిడెంట్స్ ఆధారంగా రూపొందిస్తున్న ఈ సినిమాలో తేజ, తన్మయి లీడ్ రోల్స్ చేస్తున్నారు. స్టూడియో 99 సంస్థ నిర్మిస్తోంది. ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క ఈ మూవీ టైటిల్, ఫస్ట్ లుక్ పోస్టర్‌ను లాంచ్ చేసి టీమ్‌కు బెస్ట్ విషెస్ చెప్పారు. అందర్నీ ఆలోచింపజేసేలా ఈ చిత్రం ఉంటుందని, త్వరలోనే రిలీజ్ డేట్ అనౌన్స్ చేస్తామని దర్శక నిర్మాతలు తెలియజేశారు.
ఝాన్సీ, పావోన్ రమేష్, తాగుబోతు రమేష్, ప్రణీత్ ఇతర పాత్రలు పోషిస్తున్నారు. మార్క్ కె రాబిన్ సంగీతం అందిస్తున్నాడు. రానా దగ్గుబాటికి చెందిన స్పిరిట్ మీడియా ఈ చిత్రాన్ని విడుదల చేయనుంది.