
- జేఏసీకి తెలిపిన డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క
హైదరాబాద్, వెలుగు: ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఏర్పాటు చేసిన కేబినెట్ సబ్ కమిటీ ఈ నెల 12న సమావేశం కానుందని డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క వెల్లడించారు. సోమవారం ప్రజా భవన్లో ఉద్యోగుల జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు, పలువురు జేఏసీ నేతలు డిప్యూటీ సీఎంను కలిసి 57 సమస్యలపై వినతిపత్రం అందజేశారు.
ప్రభుత్వంపై ఆర్థిక భారంలేని సమ స్యలే 45 ఉన్నాయని, కేవలం ఉన్నతా ధికారులు సమావేశాలు నిర్వహిస్తే సమస్యలు పరిష్కారం అవుతాయని నేతలు డిప్యూటీ సీఎం దృష్టికి తెచ్చారు. లోక్‌సభ ఎన్నికల టైమ్‌లో బదిలీ చేసిన ఎంపీడీవోలు, తహసీల్దార్లను తిరిగి పాత ప్లేస్‌లోకి బదిలీ చేయాలని కోరారు.