వచ్చే ఏడాది ఏడుగురు ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ల రిటైర్మెంట్స్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు: వచ్చే ఏడాదిలో ఏడుగురు సీనియర్‌‌‌‌‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌ అధికారులు పదవీ విరమణ పొందనున్నారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి ఉత్తర్వులు జారీ చేశారు. 2025లో  పదవీ విరమణ పొందనున్న వారిలో హోంశాఖ ముఖ్యకార్యదర్శి రవిగుప్తా, డీజీపీ జితేందర్‌‌‌‌‌‌‌‌ కూడా ఉన్నారు.

సీనియర్‌‌‌‌‌‌‌‌ ఐపీఎస్‌‌‌‌‌‌‌‌లు వీబీ కమలాసన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి 2025లో ఏప్రిల్‌‌‌‌‌‌‌‌ 30న, డి.ఉదయ్‌‌‌‌‌‌‌‌కుమార్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మే 31న, వి.సత్యనారాయణ జూన్‌‌‌‌‌‌‌‌ 30న, కొత్తకోట శ్రీనివాస్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆగస్టు 31న, డా.జితేందర్‌‌‌‌‌‌‌‌ సెప్టెంబర్‌‌‌‌‌‌‌‌ 30న, పి.విశ్వప్రసాద్‌‌‌‌‌‌‌‌ నవంబర్‌‌‌‌‌‌‌‌ 30న, రవిగుప్తా డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 31న పదవీ విరమణ పొందనున్నారు.