హైదరాబాద్:సైబర్ మోసాలు రోజుకు రోజుుకు పెరిగిపోతున్నాయి. రోజుకో పద్దతిలో సైబర్ నేరగాళ్లు మోసాలు పాల్పడుతున్నాయి. డేటా దొంగిలించడం ద్వారా బ్యాంకు ఖాతాలు కొల్లగొట్టడం, అధికారులమని చెప్పి కాల్స్ చేస్తూ ప్రజలను దోచుకుంటున్నారు. హైదరాబాద్ లో పెరుగుతున్న సైబర్ మోసాలపట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ డీజీపీ హెచ్చరికలు చేశారు. పోలీసుల పేరుతో కాల్స్ చేస్తూ మోసాలకు పాల్పడుతున్న సైబర్ గాళ్ల భరతం పడతామని చెప్పారు. సైబర్ నేరగాళ్లు పోలీసుల డీపీతో కాల్స్ చేస్తూ మోసం చేస్తున్నారని ప్రజలు అలర్ట్ గా ఉండాలని ఓ పోస్ట్ ను X సోషల్ మీడియాలో షేర్ చేశారు.
‘‘ఇలా పోలీస్ డీపీ ఫొటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పనిచేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు.. అలాంటి ఫోన్ కాల్స్ పట్ల అప్రమత్తంగా ఉండాలని’’ డీజీపీ ప్రజలను అలర్ట్ చేస్తూ పోస్ట్ లో రాశారు.
#CyberFraudAlert #FakePoliceCall
— DGP TELANGANA POLICE (@TelanganaDGP) July 19, 2024
ఇలా పోలీస్ డీపీ ఫోటో పెట్టుకున్న అపరిచితులు ఫోన్ చేసి మీకు సంబంధించిన వాళ్లు పట్టుబడ్డారని, లేదా వాళ్ల పేరు మీద ఇల్లీగల్ డ్రగ్స్ కొరియర్లు వచ్చాయని, వాళ్లు ఇంకేదో పెద్ద తప్పు పని చేశారని మిమ్మల్ని టెన్షన్లో పెట్టి బురిడీ కొట్టిస్తారు. అలాంటి… pic.twitter.com/9tO9T7TJZ2