వర్షాకాల నేపథ్యంలో తెలంగాణ డీజీపీ రవిగుప్త వాహనదారులు కీలక సూచనలు చేశారు. వర్షాలు పడినప్పుడు మ్యాన్ హోల్స్ తెరిచి ఉన్నందున ప్రమాదాలు జరుగుతున్నాయి. అంతేగాకుండా వాహనాలు జారి పడుతుంటాయి. ఈ క్రమంలో వాహనదారులు సరైన జాగ్రత్తలు పాటించి రోడ్డు ప్రమాదాల నివారణకు సహకరించాలని కోరారు తెలంగాణ డీజీపీ .
సూచనలివే..
- మీ వాహనాల టైర్ల గ్రిప్ /థ్రెడ్ ఏ విధంగా ఉందో సంబంధిత వాహన నిపుణులతో చెక్ చేసుకోండి. టైర్ల గ్రిప్ బాలేకపోతే వెంటనే మార్చుకోండి. మీ వాహన టైర్ల గాలిని ఎప్పటికప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి.
- వర్షం కురుస్తున్నపుడు పరిమిత వేగంతో ప్రయాణించటం ఎల్లవేళలా మంచిది.
- మీ వాహన ఇంజిన్ కండిషన్ ఎలా ఉందో చెక్ చేసుకోండి. బ్రేక్స్ పాడ్స్, విండ్ స్క్రీన్ వైపర్ల కండిషన్ ఒకటికి రెండు సార్లు చెక్ చేయించండి.
- ఎప్పుడైనా అవసరం వస్తే మీ వాహనాల్లో ఎమర్జెన్సీ కిట్లు అందుబాటులో ఉండేలా ఏర్పాటు చేసుకోండి.
- అత్యవసర సమయాల్లో #Dial100 కి కాల్ చేసేలా మీ మొబైల్/ మీ వాహనంలో వీలైతే స్పీడ్ డయల్ ఏర్పాటు చేసుకోండి.
- మీ మరియు మీ కుటుంబ భద్రత దృష్ట్యా ఈ సూచనలు ఎంతో మంచివి