తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. రోజురోజకు కేసుల సంఖ్య పెరుగుతూ వస్తోంది. తాజాగా తెలంగాణ హెల్త్ డైరెక్టర్ డీహెచ్ శ్రీనివాస్ రావుకు కోవిడ్ పాజిటివ్ అని తేలింది. ఆయనకు స్వల్పంగా కోవిడ్ లక్షణాలు బయటపడటంతో టెస్ట చేయించుకున్నారు. పరీక్ష ద్వారా పాజిటివ్ అని నిర్ధారణ కావడంతో,ముందు జాగ్రత్తగా ఐసోలేషన్ లో ఉన్నామన్నారు. మెరుగైన చికిత్స కోసం ఆయన ఆసుపత్రిలో చేరుతున్నానని తెలిపారు. ఏ విధమైన ఆందోళనలు, అపోహలు వద్దన్నారు. త్వరలో పూర్తి ఆరోగ్యంతో మీ ముందుకు వస్తానని తెలిపారు డీహెచ్. ప్రజలంతా వ్యాధి పట్ల అప్రమత్తంగా ఉండలని కోరుతున్నానన్నారు.
మరోవైపు తెలంగాణలో కరోనా కలకలం కొనసాగుతోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో పనిచేసే సిబ్బంది కరోనా వైరస్ బారిన పడుతున్నారు. హైదరాబాద్ లోని పోలీస్ స్టేషన్లు, ఆస్పత్రులు, మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయాల్లో పనిచేసే ఉద్యోగులు కరోనా సోకింది. వరంగల్ ఎంజీఎం ఆస్పత్రిలో కరోనా కలకలం రేగింది. 69 మంది వైద్య సిబ్బందికి కరోనా పాజిటీవ్ గా నిర్థారణ అయింది. నిత్యం కేసులు పెరుగుతూ వస్తున్నాయి. ప్రజలంతా మాస్కులు ధరించి.. తప్పకుండా భౌతిక దూరం పాటించాలని అధికారులు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి:
మంగళసూత్రం ధరించినప్పుడు అలా ఫీల్ అయ్యా
MGM లో 69మంది వైద్యసిబ్బందికి పాజిటివ్