టీడీసీఏ టీ20 టోర్నీ షురూ

టీడీసీఏ టీ20 టోర్నీ షురూ

హైదరాబాద్‌‌‌‌, వెలుగు : తెలంగాణ డిస్ట్రిక్స్‌‌‌‌  క్రికెట్‌‌‌‌ అసోసియేషన్‌‌‌‌ (టీడీసీఏ) అండర్‌‌‌‌-17 ఇంటర్ డిస్ట్రిక్ట్‌ టీ20 క్రికెట్‌‌‌‌ టోర్నమెంట్‌‌‌‌ సోమవారం హైదరాబాద్‌‌‌‌లో మొదలైంది. నాలుగు రోజుల పాటు జరిగే ఈ టోర్నీలో  హైదరాబాద్‌‌‌‌ మినహా 9 ఉమ్మడి జిల్లాల జట్లు, టీడీసీఏ కంబైన్డ్‌‌‌‌ డిస్ట్రిక్ట్స్‌‌‌‌ టీమ్ పోటీ పడుతున్నాయి. దోమలగూడలోని ప్రభుత్వ ఫిజికల్‌‌‌‌ ఎడ్యుకేషన్‌‌‌‌ కాలేజ్‌‌‌‌ గ్రౌండ్‌‌‌‌లో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్​ తెలంగాణ చైర్మన్  శివసేనా రెడ్డి, మాజీ మంత్రి సి. లక్ష్మారెడ్డితో కలిసి ఈ టోర్నీని ప్రారంభించారు. 

 రాష్ట్రంలో ప్రతిభావంతులైన క్రీడాకారులకు కొదవ లేదని, వారికి సరైన అవకాశాలు కల్పిస్తే పల్లెల నుంచి ప్రపంచ చాంపియన్లుగా వెలుగులోకి వస్తారని ఆయన అన్నారు.  ఇక హైదరాబాద్ తప్పితే రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల క్రికెటర్లకు సరైన అవకాశాలు లభించటం లేదని, జిల్లాల్లో క్రికెట్‌‌‌‌ అభివృద్ధికి బీసీసీఐ నుంచి గుర్తింపు కోసం ప్రయత్నాలు చేస్తున్నామని టీడీసీఏ ప్రెసిడెంట్‌‌ అల్లీపురం వెంకటేశ్వర్ రెడ్డి చెప్పారు. 

ఈ టోర్నీలో సత్తా చాటే ప్లేయర్లను మార్చిలో హైదరాబాద్ పర్యటనకు వచ్చే  అమెరికా క్రికెట్‌‌‌‌ అకాడమీ జట్టుతో పోటీపడే టోర్నీకి ఎంపిక చేస్తామని  తెలిపారు.