
- టీజీసీహెచ్ఈ చైర్మన్ కు టీడీఏ వినతి
హైదరాబాద్, వెలుగు: యూనివర్సిటీల్లో చేపట్టబోయే అసిస్టెంట్ ప్రొఫెసర్ పోస్టుల భర్తీలో యూజీసీ-2018 గైడ్ లైన్స్ అమలు చేయాలని ప్రభుత్వాన్ని తెలంగాణ డాక్టరేట్ అసోసియేషన్(టీడీఏ) కోరింది. ఈ మేరకు ఉన్నత విద్యామండలి( టీజీసీహెచ్ఈ)చైర్మన్ బాలకిష్టారెడ్డిని టీడీఏ ప్రతినిధులు కలిసి వినతి పత్రం అందించారు. ప్రభుత్వం జారీ చేసిన జీవో21కు సవరణలు చేయాలని కోరారు. పీహెచ్ డీ ఉంటే కేవలం పది మార్కులు మాత్రమే కేటాయించారని, దాన్ని 30 మార్కులకు పెంచాలని కోరారు. స్టేట్ లోని వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 3వేల పోస్టులను భర్తీ చేయాలని విజ్ఞప్తి చేశారు.
నెట్ లేదా పీహెచ్డీ వంటి కనీస అర్హతలను తప్పనిసరి చేయకపోవడం యూజీసీ నిబంధనలకు విరుద్ధమని చెప్పారు. అసిస్టెంట్ ప్రొఫెసర్ల భర్తీ కోసం జారీ చేసిన గైడ్ లైన్స్ ను మార్చాలని కోరారు. చైర్మన్ ను కలిసిన వారిలో టీడీఏ ప్రెసిడెంట్ డాక్టర్ నరేందర్ రెడ్డి, ఉపాధ్యక్షులు బొల్లం తిరుపతి, ప్రతినిధులు సుభాశ్ చంద్రబోస్, నర్సింహా గౌడ్, రామానాయుడు, విజయ్, స్వామి నాయక్, ఆంజనేయులు, నగేశ్ తదితరులున్నారు.