ప్రశాంతంగా ముగిసిన డీఎస్సీ పరీక్షలు.. ఫలితాలు ఎప్పుడంటే..

హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా డీఎస్సీ పరీక్షలు నేటితో (ఆగస్ట్ 5, 2024) ప్రశాంతంగా ముగిశాయి. గత నెల 18న ప్రారంభం అయిన డీఎస్సీ పరీక్షలు నేటితో ముగిశాయి. మొత్తం 11,062 టీచర్ పోస్టుల భర్తీకి విద్యా శాఖ డీఎస్సీ నిర్వహించింది. ఈ నెలాఖరులో ఫలితాలు విడుదల చేసే ఆలోచనలో అధికారులు ఉన్నారు.  ప్రాథమిక కీని విడుదల చేసి అభ్యంతరాలను స్వీకరించి తదుపరి ఫైనల్ కీని ఖరారు చేయాలని నిర్ణయించారు. అనంతరం.. జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ విడుదల చేస్తారు.

11,062 టీచర్ పోస్టులకు గానూ 2.79 లక్షల దరఖాస్తులు అందాయని విద్యా శాఖ అధికారులు వెల్లడించారు. ఈసారి డీఎస్సీ పరీక్షలు ఆన్లైన్ విధానంలో జరిగాయి. మొత్తం 13 రోజుల పాటు పరీక్షలు జరిగాయి. జులై 18న స్కూల్ అసిస్టెంట్ సాంఘిక శాస్త్రం, పీఈటీ, భౌతిక శాస్త్రం పరీక్షలతో మొదలై ఆగస్ట్ 5న లాంగ్వేజ్ పండిట్ (హిందీ) పరీక్షతో డీఎస్ సీ పరీక్షలు ముగిశాయి.