తెలంగాణాలో దసరా, బతుకమ్మ సెలవులు..మొత్తం ఎన్ని రోజులంటే

తెలంగాణలో అన్ని పండగల్లో అత్యంత ముఖ్యమైన పండగ దసరా. ఈ పండగకు ఎక్కడెక్కడో ఉన్న వాళ్లంతా సొంతూళ్లకు చేరుకుని కుటుంబ సభ్యులతో కలిసి దసరాను జరుపుకుంటారు. దసరాతో పాటు బతుకమ్మను అంతేఘనంగా జరుపుకుంటారు తెలంగాణ ప్రజలు. అందుకే రాష్ట్ర వ్యాప్తంగా పాఠశాలలు, కాలేజీలు, ఇతర ప్రభుత్వ కార్యాలయాలు ముందుగానే సెలవు ప్రకటిస్తుంది.  

ఈ ఏడాది అక్టోబర్ 24న లో దసరా పండగ జరగనుంది. అక్టోబర్ 22వ తేదీ దుర్గాష్టమి అంటే పెద్ద బతుకమ్మ పండగ జరగనుంది. ఈ నేపథ్యంలో  స్కూల్స్, కాలేజీలు, ఆఫీస్లకు ముందుగానే  ప్రభుత్వం సెలవు మంజూరు చేస్తుంది. ఈసారి బతుకమ్మ, దసరా పండుగలకు సెలవులు కలిపి మొత్తం 13 రోజులు పాటు సెలవులు రానున్నాయి. ఈ మేరకు తెలంగాణ ప్రభుత్వ పాఠశాలల అకడమిక్ క్యాలెండర్ 2022-23లో దసరా సెలవులకు సంబంధించిన వివరాలను విద్యాశాఖ ముందుగానే ప్రకటించింది. 

తెలంగాణలో దసరా సెలవులు 2022లో 14 రోజులు ఉండగా..2023లో  మాత్రం 13 రోజులే ఇచ్చారు. ఈ ఏడాది అక్టోబర్ 14వ తేదీ నుంచి అక్టోబర్ 25వ తేదీ వరకు బతుకమ్మ, దసరా సెలవులు ఉండనున్నాయి. తిరిగి అక్టోబర్ 26వ తేదీన పాఠశాలల తెరుచుకోనున్నాయి. తెలంగాణలో స్కూళ్లకు సంబంధించిన 2023-24 అకాడమిక్ క్యాలెండర్ లో ఈ సెలవుల పూర్తి వివరాలను పాఠశాల విద్యాశాఖ పొందిపరిచింది.