నైనీ బొగ్గు గనుల్లో సింగరేణికి  సహకరిస్తం: ఉపముఖ్యమంత్రి భట్టి

  • సమస్యలను వెంటనే పరిష్కరించాలె

  • అధికారలకు ఒడిషా సీఎం ఆదేశాలు

  • ఒడిశా సీఎం మోహన్ మాఝీతో  భట్టి భేటీ 
     

భువనేశ్వర్​:    ఒడిశాలోని నైని బొగ్గు గనుల్లో  తవ్వకాలు చేపట్టడానికి సింగరేణి కంపెనీకి పూర్తిగా సహకరిస్తామని ఒడిశా సీఎం మోహన్ చరణ్ మాఝీ తెలిపారు.  ఇవాళ  సీఎం మోహన్ మాఝీతో   తెలంగాణ  డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క   భువనేశ్వర్​లో భేటీ అయ్యారు. సింగరేణికి కేటాయించిన నైని కోల్ బ్లాక్ లో సింగరేణి కార్యకలాపాల ప్రారంభానికి సంబంధించి ఎలాంటి అడ్డంకులు లేకుండా చూడాలని ఆయన కోరారు. 

 సింగరేణి ఆధ్వర్యంలో చేపట్టనున్న నైని బొగ్గు బ్లాక్ తవ్వకాలకు కావలసిన అనుమతులకు స హకరించాల్సిందిగా భట్టి  కోరడంతో  సీఎం మోహన్​ సానుకూంగా స్పందించారు. ఈ విషయంలో వెంటనే చర్యలు చేపట్టాలంటూ  అధికారులకు సీఎం మోహన్ ఆదేశాలు జారీ చేశారు. ఈసందర్భంగా సింగరేణికి నైని బొగ్గు బ్లాకుల ఆవశ్యకతను  భట్టి  వివరించారు. 2017 లోనే సింగరేణికి నైని గనులను కేటాయించారన్నారు.  గతంలో నాటి బొగ్గు గనుల మంత్రి ప్రహ్లాద్ జోషిని కలిసి అందించిని వినతి పత్రాలను సీఎంకు  అందజేశారు.   

Also Read -: రేవంత్ పదేండ్లు అధికారంలో ఉంటడు:ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్

 

నైనీ బొగ్గు గనుల తవ్వకానికి పూర్తిగా సహకరిస్తామని సీఎం మోహన్ హామీ ఇచ్చారు.  భూముల బదలాయింపు, విద్యుత్తు, రహదారుల సమస్యలను వెను వెంటనే పరిష్కరించాలని  ఉన్నత అధికారులకు ఒడిశా సీఎం ఆదేశాలు జారీ చేశారు.  నైని బొగ్గు బ్లాక్ అనుమతులు సాధిస్తే సింగరేణికి మరింత ఆర్థిక ప్రయోజనం చేకూరనుంది.