తెలంగాణలో మళ్లీ భూకంపం వస్తుందా.? అధికారులు ఏం చెబుతున్నారు..

 తెలుగు రాష్ట్రాల్లో డిసెంబర్ 4న పలు జిల్లాల్లో  భూకంపం కలకలం రేపిన సంగతి తెలిసిందే.  హైదరాబాద్ తో పాటు తెలంగాణలోని పలు చోట్ల రెండు నుంచి ఐదు సెకన్ల పాటు భూమి కంపించింది. ములుగు జిల్లా  మేడారం కేంద్రంగా భూకంపం వచ్చింది. రిక్టర్ స్కేలుపై తీవ్రత 5.2గా నమోదయ్యింది. ఇలాంటి భూకంపం రావడం తెలంగాణలో గత 20 ఏళ్లలో ఇదే తొలిసారని అధికారులు చెబుతున్నారు. 

 అయితే  తెలంగాణలో భూ ప్రకంపనలు రావడంపై ఎంజీఆర్ఐ అధికారి డాక్టర్ శేఖర్ స్పందించారు.  గోదావరి పరివాహక ప్రాంతంలో ఈ భూ ప్రకంపనలు వచ్చాయని చెప్పారు.  ములుగు ప్రాంతంలో ఈ భూకంపం స్టార్ట్ అయింది.. డిసెంబర్ 4న  ఉదయం 7:20కు ఈ భూకంపం వచ్చింది. దీని ప్రభావం ఎక్కువగా ములుగు భద్రాచలం కొత్తగూడెం జిల్లాలలో చూపించింది. గోదావరి పరివాహక ప్రాంతాల్లో సహజంగా రిక్టర్ స్కేలు పై 6 గా ఉంటుంది అని వెల్లడించారు.

ALSO READ | తెలంగాణలోని పలు జిల్లాల్లో భూ కంపం..రిక్టర్ స్కేలుపై 5.3

 సహజంగా నది పర్వహక ప్రాంతాల్లో వచ్చినప్పుడు సుమారు 300 కిలోమీటర్ల దూరంలో దీని ప్రభావం ఉంటుంది. అందువల్లనే హైదరాబాదులో పలుచోట్ల భూమి కనిపించింది. ఇది గోదావరి ములుగు ప్రాంతంలో మొదలై స్వల్పంగా కృష్ణ నదిలో భూకంపం వచ్చింది.  మళ్లీ భూ ప్రకంపనలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. 1969 లో భద్రాచలంలో అత్యధికంగా 5.7 రిక్టర్ స్కేలుపై భూకంపం వచ్చింది.  ప్రజలు ఎవరు భయాందోళనకు గురి కావొద్దు. పగుళ్లు ఉన్నటువంటి బిల్డింగ్స్ పాత బిల్డింగ్స్ లలో ఉండకపోవడం మంచిదని ఎంజీఆర్ఐ అధికారి డాక్టర్ శేఖర్ తెలిపారు.