విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి : టి.లింగారెడ్డి

విద్యారంగానికి 20 శాతం నిధులు కేటాయించాలి : టి.లింగారెడ్డి

హనుమకొండ, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశ పెట్టబోయే బడ్జెట్​లో విద్యా రంగానికి కనీసం 20శాతం నిధులు కేటాయించాలని డీటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ రాష్ట్ర నాయకుడు టి.లింగారెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు హనుమకొండ కలెక్టరేట్​ఎదుట శనివారం ప్రదర్శన నిర్వహించారు. ఈ సందర్భగా టి.లింగారెడ్డి మాట్లాడుతూ గత ప్రభుత్వం విద్యారంగాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందన్నారు. 

కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే విద్యారంగానికి కనీసం 15 శాతం నిధులు కేటాయిస్తామని ఎన్నికల సమయంలో ప్రకటించిందని, ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్​చేశారు. అనంతరం హనుమకొండ అడిషనల్ కలెక్టర్ వెంకట్ రెడ్డికి వినతిపత్రం అందజేశారు.  తెలంగాణ విద్యా పరిరక్షణ కమిటీ నాయకులు డాక్టర్ ఎం.గంగాధర్, ఆర్.రమేశ్, మెట్టు రవీందర్, బి.నర్సింహారావు, కే.శ్రీనివాస్, జి.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.