అర్బన్‌‌‌‌‌‌‌‌ నక్సల్స్‌‌‌‌‌‌‌‌ చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ: కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌

అర్బన్‌‌‌‌‌‌‌‌ నక్సల్స్‌‌‌‌‌‌‌‌ చేతిలో తెలంగాణ విద్యా వ్యవస్థ: కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌
  • స్టూడెంట్లను అంబేద్కర్, పటేల్, ఛత్రపతిలా
  • తీర్చిదిద్దేందుకే న్యూ ఎడ్యుకేషన్ పాలసీ: బండి సంజయ్
  • గన్నుల రాజ్యం కావాలో పెన్నుల రాజ్యం కావాలో?
  • ఆలోచించండని కామెంట్

కరీంనగర్, కొత్తపల్లి, వెలుగు: తెలంగాణ విద్యావ్యవస్థ అర్బన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ నక్సల్స్ చేతిలో బందీగా మారిందని కేంద్రమంత్రి బండి సంజయ్‌‌‌‌‌‌‌‌ అన్నారు. తెరమరుగైన అంశాలను వెలుగులోకి తీసుకొచ్చి స్టూడెంట్లను అంబేద్కర్, పటేల్, తాంతియా తోపే, ఛత్రపతి శివాజీ, వీర సావర్కర్‌‌‌‌‌‌‌‌లా తీర్చిదిద్దాలని కేంద్ర ప్రభుత్వం కొత్త ఎడ్యుకేషన్‌‌‌‌‌‌‌‌ పాలసీని తీసుకొచ్చిందన్నారు. తెలంగాణలో మాత్రం నక్సల్స్‌‌‌‌‌‌‌‌ భావజాలాన్ని జొప్పించి స్టూడెంట్లను చండ్ర పుల్లారెడ్డి, కొండపల్లి సీతారామిరెడ్డిలా తయారు చేయాలని చూస్తున్నరని మండిపడ్డారు. నరేంద్రమోదీ దేశాన్ని పెన్నుల రాజ్యంగా మారుస్తుంటే.. తెలంగాణ ప్రభుత్వం గన్నుల రాజ్యం కావాలని చూస్తున్నదని.. ఏది కావాలో నేటి సమాజం ఆలోచించాలని కోరారు. 

శనివారం కరీంనగర్ జిల్లా కొత్తపల్లి లోని ఓ ప్రైవేట్ స్కూల్ వార్షికోత్సవంలో సంజయ్ మాట్లాడుతూ.. ఇప్పుడున్న కార్పొరేట్ స్కూల్స్ విద్యను వ్యాపారం చేస్తున్నాయని ఆరోపించారు. 60 ఏండ్ల నుంచి మన విద్యావిధానంలో భారత జాతిని బలహీనంగా చూపించి, దేశంపై దండయాత్ర చేసి, ఇక్కడి ప్రజలపై అకృత్యాలకు పాల్పడిన వాళ్లను గొప్పగా చూపించారని, మన సంస్కృతిని తుడిచి పెట్టే ప్రయత్నం చేసిన కొన్ని రాజవంశాలను గొప్పగా వర్ణించారన్నారు. నిజాం గొప్పోడని చెప్పారని, కానీ మన తెలంగాణ ఆడబిడ్డలను నగ్నంగా బతుకమ్మ ఆడిస్తూ, అరాచకాలు, హత్యలకు పాల్పడ్డ విషయాన్ని తెరమరుగు చేశారన్నారు. అందుకే ప్రధాని నరేంద్రమోదీ న్యూ ఎడ్యుకేషన్ పాలసీ తీసుకువచ్చారని చెప్పారు.

బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక కుట్ర

బీసీ జాబితాలో ముస్లింలను చేర్చడం వెనుక పెద్ద కుట్ర దాగి ఉందని, ఇది హిందూ సమాజానికి పెను ప్రమాదమని బండి సంజయ్ హెచ్చరించారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి ప్రభుత్వం 4 శాతం రిజర్వేషన్లను అమలు చేయడంతో జీహెచ్ఎంసీ ఎన్నికల్లో బీసీలు గెలవాల్సిన స్థానాల్లో ముస్లింలు గెలిచారని గుర్తు చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల ప్రచారంలో భాగంగా శనివారం సాయంత్రం బీజేపీ ఆధ్వర్యంలో కరీంనగర్ లోని రాంనగర్ చౌరస్తా నుంచి గీతాభవన్ చౌరస్తా వరకు ‘పట్టభద్రుల సంకల్ప యాత్ర’ నిర్వహించారు. 

యాత్రకు బండి సంజయ్ తోపాటు మెదక్, ఆదిలాబాద్ ఎంపీలు రఘునందన్ రావు, గోడం నగేశ్, ఎమ్మెల్యేలు పాయల శంకర్, కాటేపల్లి వెంకరమణారెడ్డి, పాల్వాయి హరీశ్ బాబు, రామారావు పటేల్, ధన్ పాల్ సూర్యనారాయణ గుప్తా,  బీజేపీ ఎమ్మెల్సీ అభ్యర్థులు అంజిరెడ్డి, మల్క కొమరయ్య, మాజీ మేయర్ సునీల్ రావు  తదితరులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బండి సంజయ్ మాట్లాడుతూ ‘‘‘ఒకవైపు కులగణన సర్వేలో బీసీల జనాభా శాతాన్ని తగ్గించి దెబ్బతీస్తున్నారు. ఇంకోవైపు బీసీ జాబితాలో ముస్లింలను చేర్చి యావత్ హిందూ సమాజాన్నే దెబ్బతీసే ఘోరమైన కుట్ర జరుగుతోంది. ఇంత అన్యాయం జరుగుతుంటే బీసీ సంఘాలు ఎందుకు స్పందించడం లేదు? వాళ్ల నోళ్లు ఎందుకు మూతపడ్డాయి?’’అని మండిపడ్డారు. 

మేధావులు, పట్టభద్రులు ఈ విషయంలో మౌనంగా ఉండటం సమాజానికే అరిష్టమన్నారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ కు గుణ పాఠం చెప్పాలంటే బీజేపీ అభ్యర్థులను గెలిపించాలని పిలుపునిచ్చారు. కాంగ్రెస్, బీఆర్ఎస్ మధ్య మ్యాచ్ ఫిక్సింగ్ జరుగుతోందని, అందుకే  డ్రగ్స్, కాళేశ్వరం, ఫార్ములా ఈ రేస్ కేసులో ఆధారాలున్నా ఎవరిని అరెస్ట్ చేయలేదని ఆరోపించారు. బీఆర్ఎస్ కూడా అభ్యర్థిని నిలబెట్టకుండా కాంగ్రెస్ కు సహకరిస్తున్నదని అన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ ఎన్నికల బీజేపీ మేనిఫెస్టోను బండి సంజయ్ రిలీజ్​చేశారు.