
దుబ్బాక, వెలుగు: బీజేపీ దుబ్బాక అభ్యర్థి, ఎమ్మెల్యే రఘునందన్ రావుకు మద్దతుగా బీజేపీ శ్రేణులు ఆదివారం మండలంలోని వివిధ గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. పట్టణ కేంద్రంలో బీజేవైఎం జిల్లా ఉపాధ్యక్షుడు సుంకోజి ప్రవీణ్‌కుమార్, దుంపలపల్లిలో బీజేవైఎం జిల్లా కార్యదర్శి తొగుట రవీందర్, బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి మచ్చ శ్రీనివాస్ బీజేపీకి ఓటెయ్యాలని ఓటర్లను అభ్యర్థించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ..బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే కేసీఆర్ హయాంలో జరిగిన అవినీతిపై విచారణ కమిటీ ఏర్పాటు చేస్తుందన్నారు.
ఉప ఎన్నికల్లో రఘునందన్గెలిచిన తర్వాతనే దుబ్బాకలో కొత్త బస్టాండ్, వంద పడకల ఆస్పత్రి, డబుల్ బెడ్రూమ్ల పంపిణీ, సీసీ రోడ్లు, ప్రతి గ్రామంలో హైమాస్ లైట్లు, అక్భర్పేట-భూంపల్లి మండలం, జాతీయ రహదారి వచ్చాయన్నారు. మరోసారి దుబ్బాక ప్రజలు రఘునందన్‌రావును గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ నాయకులు, కార్యకర్తలు, మహిళలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.