నిజాం కాలేజీలో 7 కిలోల బంగారం..300 కిలోల వెండి సీజ్..

నిజాం కాలేజీలో 7 కిలోల బంగారం..300 కిలోల వెండి  సీజ్..

తెలంగాణలో ఎన్నికల కోడ్ అమల్లోకి రావడంతో పోలీసులు ఎక్కడికక్కడ చెక్ పోస్టులు ఏర్పాటు చేసి ముమ్మర తనిఖీలు చేస్తున్నారు. ఈ తనిఖీల్లో అక్రమంగా తరలిస్తున్న డబ్బు, మద్యంతో పాటు..ప్రజలకు పంపిణీకి సిద్దంగా ఉంచిన చీరలు, కుక్కర్లను స్వాధీనం చేసుకుంటున్నారు. అయితే హైదరాబాద్ నగరం నడిబొడ్డున పోలీసులు భారీగా బంగారం, వెండిని స్వాధీనం చేసుకున్నారు. 


బషీర్ బాగ్ లోని నిజాంకాలేజీలో బంగారం, వెండిని పోలీసులు పట్టుకున్నారు. నిజం కాలేజ్ 1వ నెంబర్  గేట్ దగ్గర  7 కేజీల బంగారం, 1 కేజీ వెండిని పోలీసులు సీజ్ చేశారు. పట్టుబడ్డ బంగారం, వెండి విలువ దాదాపు రూ. 10 కోట్ల వరకు ఉంటుందని పోలీసులు తెలిపారు.  సంఘటన స్థలానికి డీసీపీ, ఇతర ఉన్నతాధికారులు చేరుకున్నారు. దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.