'హోం ఓటింగ్' ప్రారంభం.. ఇంటికెళ్లి ఓటు తీసుకుంటున్న ఎన్నికల అధికారులు

తెలంగాణలో హోం ఓటింగ్ ప్రారంభమైంది. రాష్ట్రంలోని పలు జిల్లాలో ఎన్నికల అధికారులు.. 80 సంవత్సరాలు పైబడిన వృద్ధులు, 40శాతం కన్న ఎక్కువ వైకల్యం ఉన్న వికలాంగులు, కరోనా బాధితుల కోసం 2023, నవంబర్ 23వ తేదీ గురువారం నుంచి హోం ఓటింగ్ ప్రారంభించారు. నవంబర్ 30వ తేదీ గురువారం రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న  విషయం తెలిసిందే. 

ఎన్నికలకు మరో వారం రోజులే ఉండడంతో ఎన్నికల అధికారులు హోం ఓటింగ్ చేపట్టారు. ఇందులో భాగంగా గురువారం కరీంనగర్ జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల పరిధిలో ఎన్నికల అధికారులు  హోం ఓటింగ్ తీసుకుంటున్నారు. జిల్లాలో 373 మంది వికలాంగులు, 644 మంది వృద్ధులు ఈ పద్ధతిలో ఓటు వేయనున్నారు. ఈ క్రమంలో ఎన్నికల అధికారులు నేరుగా ఇంటికే వెళ్లి ఓటును తీసుకుంటున్నారు.

Also Read :-కంగువ షూటింగ్లో ప్రమాదం.. హీరో సూర్యకు గాయాలు