జీడిమెట్ల, వెలుగు : కుత్బుల్లాపూర్బీఆర్ఎస్ ఎమ్మెల్యే, అతని అనుచరులు నియోజకవర్గంలో వందల కోట్ల విలువైన ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, తనను గెలిపిస్తే.. వాటిని స్వాధీనం చేసుకుని పేదలకు పంచుతామని బీజేపీ ఎమ్మెల్యే అభ్యర్థి కూన శ్రీశైలంగౌడ్వ్యాఖ్యానించారు. జగద్గిరిగుట్టలోని బీరప్పనగర్, మగ్దుంనగర్, రింగ్‌బస్తీ, శ్రీనివాస్‌నగర్, భగత్సింగ్మార్గ్, సీసలబస్తీ తదితర ప్రాంతాల్లో శుక్రవారం ఎన్నికల ప్రచారం నిర్వహించారు. బీజేపీ కమలం గుర్తుపై ఓటు వేసి గెలిపించాలని ఆయన కోరారు.
ఈ సందర్భంగా శ్రీశైలం గౌడ్ మాట్లాడుతూ.. కేంద్రంలో ప్రధాని మోదీ నాయకత్వంలో తెలంగాణకు 2.40 లక్షల ఇండ్లను మంజూరు చేస్తే ఒక్కటి కూడా పేదలకు ఇవ్వలేదని మండిపడ్డారు. ఇది పేదలపై బీఆర్ఎస్ ప్రభుత్వానికి ఉన్న ప్రేమ అని విమర్శించారు. తాను గెలవగానే పేదలకు ఇండ్లు, రేషన్‌కార్డులు, పింఛన్లు ఇప్పించడమే కాకుండా నిరుద్యోగులకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. జగద్గిరిగుట్ట బస్డిపోతోపాటు బస్తీ దవాఖానాలు, మౌలిక వసతులు కల్పిస్తానని పేర్కొన్నారు. ఈనెల 30న జరిగే ఎన్నికల్లో కమలం గుర్తుపై ఓటు వేసి తనని భారీ మెజారిటీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో పున్నారెడ్డి, సురేష్‌రెడ్డి, సుధా, మహేందర్తదితరులు పాల్గొన్నారు.