భద్రాచలం నియోజకవర్గంలో బిఆర్ఎస్కు బిగ్ షాక్ ..

ఉమ్మడి ఖమ్మం జిల్లా భద్రాచలం నియోజకవర్గంలో బీఆర్ఎస్ కు బిగ్ షాక్ తగిలింది.  భారీ సంఖ్యలో బీఆర్ఎస్కు  చెందిన ఎంపీటీసీ, సర్పంచ్ , వార్డు మెంబర్లు పార్టీని వీడారు. వీరంతా కాంగ్రెస్ లో చేరారు. 

దుమ్ముగూడెం మండల బిఆర్ఎస్ కు చెందిన  సర్పంచ్,ఎంపీటీసీ, వార్డ్ నెంబర్లు మూకుమ్మడిగా ఆ పార్టీకి రాజీనామా చేశారు.   రాజీనామా అనంతరం వీరంతా భద్రాచలం కాంగ్రెస్ ఎమ్మెల్యే పోదెం వీరయ్య సమక్షంలో కాంగ్రెస్ లో చేరారు.  దుమ్ముగూడెం మండల రైతు బంధు సమితి అధ్యక్షులు బత్తుల శోభన్ తో పాటు  40 కుటుంబాలు ఎమ్మెల్యే వీరయ్య  చేతుల మీదుగా కాంగ్రెస్ పార్టీ కండువా కప్పుకున్నారు.