కడియం వైఖరి నచ్చడం లేదు.. రాజయ్య వర్గీయుల ఆరోపణ

కడియం వైఖరి నచ్చడం లేదు.. రాజయ్య వర్గీయుల ఆరోపణ

కేటీఆర్ సర్దిచెప్పినా..స్వయంగా కేసీఆరే పదవులు పంచినా..స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో బీఆర్ఎస్ నేతల్లో సయోధ్య కుదరడం లేదు. అక్కడ కడియం వర్సెస్ రాజయ్య అన్నట్లుగా కొనసాగుతోంది. కడియం వర్గీయులు, రాజయ్య వర్గీయుల మధ్య  వార్ ఇంకా కొనసాగుతూనే ఉంది. తాజాగా కడియం శ్రీహరి వైఖరిపై ఎమ్మెల్యే తాటికొండ రాజయ్య వర్గీయులు మండిపడుతున్నారు. 

Also Read : కాంగ్రెస్ గెలిస్తే రైతు బంధుకు రాం రాం.. దళితబంధుకు జై భీమ్..

స్టేషన్ ఘన్ పూర్ నియోజకవర్గంలో కడియం శ్రీహరి..తమకు కనీస గౌరవం ఇవ్వడం లేదని రాజయ్య వర్గీయులు ఆరోపించారు. కడియం శ్రీహరి తీరుతో పార్టీకి నష్టం అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కడియంను మార్చి..రాజయ్యకు బీఫారమ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేకపోతే మూకుమ్మడిగా రాజీనామా చేస్తామని హెచ్చరించారు.