తెలంగాణ కోసం వేల కోట్ల రూపాయలు ఖర్చుపెట్టి.. ఇక్కడ అభివృద్ధి కార్యక్రమాలు శంకుస్థాపన చేయడానికి వస్తే వాటికి హాజరవ్వడానికి బీఆర్ఎస్ ప్రభుత్వానికి, సీఎంకు తీరిక లేదని విమర్శించారు. తెలంగాణ ప్రభుత్వానికి తెలంగాణ అభివృద్ధిపట్ల చిత్త శుద్ధి లేదని.. వాళ్లకు ఎంతసేపు ఓటు బ్యాంకు రాజకీయాలు కావాలని విమర్శించారు. దేశంలో ఎక్కడ కూడా ఇలాంటి ముఖ్యమంత్రి లేరు, ఇలాంటి ప్రభుత్వం లేదని కిషన్ రెడ్డి మండిపడ్డారు.
తెలంగాణ రాష్ట్ర అభివృద్ధిలో త్రిబుల్ ఆర్ రోడ్డు ఒక గేమ్ ఛేంజర్ గా మారనుందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి తెలిపారు. రూ. 26వేల కోట్లతో త్రిబుల్ ఆర్ రోడ్డును నిర్మించబోతున్నామని వెల్లడించారు. ఈ త్రిబుల్ ఆర్ రోడ్డు హైదరాబాద్ చుట్టుపక్కల ఉన్న 8 జిల్లాలతో అనుసంధానం చేస్తూ దీన్ని నిర్మించబోతున్నామన్నారు.
తెలంగాణలో రూ. 13 వేల 500 కోట్లతో అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన చేయబోతున్నారని బీజేపీ రాష్ట్ర అధ్యక్షడు కిషన్ రెడ్డి తెలిపారు. గత 9 సంవత్సరాలుగా తెలంగాణలో జాతీయ రహదారుల నిర్మాణానికి లక్ష 20వేల కోట్లతో కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెట్టిందని కిషన్ రెడ్డి తెలిపారు. రూ. 6400 కోట్లతో ఎకనామిక్ కారిడార్ ప్రాజెక్టు నిర్మాణానికి శంకుస్థాపన చేయనున్నారు.
Also Read :- తెలంగాణకు మరో వరం.. ములుగు జిల్లాలో ట్రైబల్ వర్సిటీ..
సూర్యాపేట నుంచి ఖమ్మం వరకు నాలుగు లైన్ల రోడ్డును నిర్మాస్తామని కిషన్ రెడ్డి తెలిపారు. భారతమాల ప్రాజెక్ట్ కింద ఖర్చు రూ. 2460 కోట్లను కేంద్ర ప్రభుత్వం ఖర్చు పెడుతుందని చెప్పారు. కృష్ణపట్నం- హైదరాబాద్ మల్టీ పొడక్ట్ పైప్ లైన్ ఏర్పాటు చేస్తామన్నారు.
రాష్ట్రంలో రైల్వేల అభివృద్ధి కోసం రూ. 85వేల కోట్లతో కొత్తగా ప్రాజెక్ట్ ప్లానింగ్ చేస్తు్న్నామని.. ఇప్పటికే రైల్వేల అభివృద్ధికి రూ. 32 వేల కోట్ల కేంద్ర ప్రభుత్వం సహకారం అందించిందని కిషన్ రెడ్డి తెలిపారు.