ప్లీజ్ రండి.. పార్టీలో చేరాలంటూ తుమ్మలకు మాణిక్యం ఠాకూర్ ఆహ్వానం

ప్లీజ్ రండి.. పార్టీలో చేరాలంటూ తుమ్మలకు మాణిక్యం ఠాకూర్ ఆహ్వానం

హైదరాబాద్ లో మాజీ మంత్రి తుమ్మల నాగేశ్వరరావును కాంగ్రెస్ ముఖ్య నేతలు కలిశారు.  మాదాపూర్ లోని తుమ్మల ఇంటికి వెళ్లిన స్టేట్ పార్టీ ఇంచార్జ్ మాణిక్యం ఠాకూర్, పీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, మాజీ ఎంపీ పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఆయన్ను పార్టీలోకి ఆహ్వానించారు. ఎల్లుండి తుక్కుగూడ బహిరంగ సభలో సోనియా సమక్షంలో తుమ్మల కాంగ్రెస్ కండువా కప్పుకుంటారని తెలుస్తోంది. ఈ సందర్భంగా ఠాక్రేను శాలువాతో సత్కరించారు తుమ్మల నాగేశ్వరరావు.