- జేఏసీ చైర్మన్, సెక్రటరీ జనరల్ వెల్లడి
హైదరాబాద్, వెలుగు: తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నెల 24న టీజేఎస్ చీఫ్, ఎమ్మెల్సీ కోదండరాంను ఘనంగా సన్మానిస్తామని జేఏసీ చైర్మన్ మారం జగదీశ్వర్, సెక్రటరీ జనరల్ ఏలూరి శ్రీనివాసరావు ఆదివారం ఒక ప్రకటనలో వెల్లడించారు. తెలంగాణ ఉద్యమంలో అన్ని వర్గాల ప్రజలు, ఉద్యోగులు, సంఘాలను ఏకతాటిపైకి తెచ్చిన జేఏసీ చైర్మన్ కోదండరాం కృషి మరువలేనిదన్నారు. ప్రత్యేక రాష్ర్టం ఏర్పాటైన పదేండ్ల తరువాత కోదండరాంకు ఎమ్మెల్సీ ఇవ్వడం అభినందనీయమన్నారు.
ఉద్యోగులు, టీచర్లు, పెన్షనర్లు, గెజిటెడ్, పంచాయతీ కార్యదర్శులు, గ్రూప్ 1 ఇలా 205 సంఘాలతో జేఏసీ ఏర్పాటు చేశామని తెలిపారు. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం, మంత్రులు, సీఎస్. ఇతర ఉన్నతాధికారులతో చర్చించడానికి , సమన్వయం చేయడానికి ఒకే వేదిక ఉండాలన్న ఉద్దేశంతో అన్ని సంఘాలతో కలిపి జేఏసీ ఏర్పాటు చేశామని వివరించారు. అలాగే రాష్ర్ట ప్రభుత్వం చేపడుతున్న స్కీమ్ లను ప్రజల్లోకి తీసుకెళ్లేందుకు, అవి సక్రమంగా అమలయ్యేలా కృషి చేసేందుకు జేఏసీ పనిచేస్తుందన్నారు.