50:50 విధానంలోఈహెచ్​ఎస్​ అమలు చేయండి

50:50 విధానంలోఈహెచ్​ఎస్​ అమలు చేయండి
  • వైద్యారోగ్య శాఖ మంత్రికి తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతిపాదనలు
  • ఉద్యోగులు, పెన్షనర్లకు క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​ అందించాలి 
  • వైద్య ఖర్చుపై ఎలాంటి పరిమితి విధించొద్దు
  • ప్రతిపాదనలపై సానుకూలంగా స్పందించిన మంత్రి దామోదర
  • సీఎంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడి

హైదరాబాద్, వెలుగు: ఎంప్లాయిస్ హెల్త్​ స్కీమ్ (ఈహెచ్​ఎస్​)లో కొత్త విధానం తీసుకురావాలని తెలంగాణ ఉద్యోగుల జేఏసీ ప్రతిపాదించింది. ఈహెచ్​ఎస్​ ఖర్చులో సగం ప్రభుత్వం భరించాలని, మిగతా సగం ఉద్యోగులు, పెన్షనర్ల నుంచి తీసుకోవాలని సూచించారు. అన్ని ఎంప్యానెల్​ హాస్పిటల్స్​లో క్యాష్​లెస్​ ట్రీట్​మెంట్​​అందించాలని, వైద్యానికయ్యే ఖ‌‌‌‌ర్చుపై ఎలాంటి ప‌‌‌‌రిమితి(సీలింగ్‌‌‌‌) విధించొద్దని విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు తెలంగాణ ఉద్యోగుల జేఏసీ చైర్మన్​ లచ్చిరెడ్డి, ఇతర సభ్యులు వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహను బుధవారం సెక్రటేరియెట్​లో కలిసి ప్రతిపాదనలను అందజేశారు. దీనిపై సానుకూలంగా స్పందించిన మంత్రి.. సీఎం రేవంత్​ రెడ్డితో చర్చించి నిర్ణయం తీసుకుంటామని వెల్లడించారు. ఈహెచ్ఎస్ కోసం ఉద్యోగుల, పింఛనర్ల బేసిక్ పే నుంచి ఒక శాతాన్ని వ‌‌‌‌సూలు చేయాల‌‌‌‌ని గత పీఆర్సీ సూచించిందని జేఏసీ సభ్యులు మంత్రి దృష్టికి తెచ్చారు. అయితే, కొన్ని ఉద్యోగ సంఘాలు ఆ ప్రతిపాద‌‌‌‌న‌‌‌‌ను వ్యతిరేకించాయన్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం 3,06,000 మంది ఉద్యోగులు, ఉపాధ్యాయులు, 2,88,415 మంది పింఛ‌‌‌‌న‌‌‌‌ర్లు ఉన్నారని ఉద్యోగుల జేఏసీ నివేదికలో పేర్కొన్నది.

ఉద్యోగుల మెడిక‌‌‌‌ల్ రీయింబ‌‌‌‌ర్స్‌‌‌‌మెంట్ కోసం ప్రస్తుతం నెలకు సుమారు రూ.40 కోట్ల మేర ప్రభుత్వం ఖ‌‌‌‌ర్చు చేస్తున్నదని, ఈహెచ్ఎస్ కోసం మొత్తం ఎంత ఖ‌‌‌‌ర్చు అవుతుందో ఈహెచ్ఎస్ లేదా ఆరోగ్యశ్రీ హెల్త్ కేర్ ట్రస్ట్‌‌‌‌ (ఏహెచ్‌‌‌‌సీటీ) ద్వారా ఖ‌‌‌‌రారు చేయాలని సూచించింది. అన్ని రాష్ట్ర ప్రభుత్వ శాఖ‌‌‌‌లు, స్థానిక సంస్థలు, ఎయిడెడ్‌‌‌‌, సొసైటీల్లో ప‌‌‌‌నిచేస్తున్న ఉద్యోగుల‌‌‌‌కు ఈ విధానం అమ‌‌‌‌లు చేయాలని, ప్రధాన కార్డుదారు స‌‌‌‌హా ఆరుగురు కుటుంబ‌‌‌‌స‌‌‌‌భ్యుల‌‌‌‌కు ఈహెచ్ఎస్ స‌‌‌‌దుపాయం క‌‌‌‌ల్పించాలని పేర్కొంది. స‌‌‌‌మాన చెల్లింపు, స‌‌‌‌మాన స‌‌‌‌దుపాయాలు అనే ప‌‌‌‌ద్ధతి ఆధారంగా ఈ విధానాన్ని రూపొందించాలని తెలిపింది. ప్యాకేజీలు, చికిత్సల‌‌‌‌కు అయ్యే ధ‌‌‌‌ర‌‌‌‌ల‌‌‌‌ను ఆస్పత్రులకు చెందిన సంఘాలు, ఉద్యోగ‌‌‌‌, ఉపాధ్యాయ‌‌‌‌, పింఛ‌‌‌‌న‌‌‌‌ర్లతో చ‌‌‌‌ర్చించి ఖ‌‌‌‌రారు చేయాలన్నారు.- 

జీవో 317ను రద్దు చేయాలి

గత ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవోతో ఉద్యోగులు పడుతున్న ఇబ్బందులను జేఏసీ సభ్యులు మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. సీఎస్​ అధ్యక్షతన అధికారులు, ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో కూడిన స్టీరింగ్ క‌‌‌‌మిటీ ఈహెచ్ఎస్ అమ‌‌‌‌లును ప‌‌‌‌ర్యవేక్షించాలన్నారు. ఇదిలాఉంటే వెంటనే జీవో నెంబర్ 317ను రద్దుచేసి ఉద్యోగులకు న్యాయం చేయాలని మంత్రిని జేఏసీ చైర్మన్​ లచ్చిరెడ్డి కోరారు. కార్యక్రమంలో టీజీఈ జేఏసీ నాయకులు డాక్టర్​ నిర్మల, కె.రామకృష్ణ, డా.కత్తి జనార్దన్, దర్శన్ గౌడ్, ఎస్.రాములు, డా.వంశీకృష్ణ, దశరథ్, జయమ్మ, రమేశ్​ పాక, రామ్ ప్రతాప్ సింగ్, గోవర్ధన్. పాండు, దీపక్ తదితరులు పాల్గొన్నారు.