ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి : జగదీశ్వర్

ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయాలి : జగదీశ్వర్
  • తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ స్టేట్ చైర్మన్ జగదీశ్వర్ 

సూర్యాపేట, వెలుగు : కాంగ్రెస్ ప్రభుత్వం​ఇచ్చిన హామీలను అమలు చేయాలని తెలంగాణ జేఏసీ ఆల్ ఎంప్లాయీస్ స్టేట్ చైర్మన్ మారం జగదీశ్వర్ కోరారు. శుక్రవారం సూర్యాపేటలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. పెండింగ్​బిల్లులను విడుదల చేస్తామని కాంగ్రెస్ హామీ వచ్చి 15 నెలలు అవుతున్నా ఇంతవరకు అమలు చేయలేదన్నారు.

 సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని డిమాండ్​చేశారు. తెలంగాణ ఎంప్లాయీస్ జేఏసీ జిల్లా చైర్మన్ షేక్ జానీమియా, అడిషనల్ జనరల్ సెక్రటరీ తంగెళ్ల జితేందర్ రెడ్డి, ఇంజినీర్ జేఏసీ చైర్మన్ పాండునాయక్, డిప్యూటీ సెక్రటరీ జనరల్ దున్న శ్యామ్, కో–చైర్మన్లు వీరన్న, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ప్రవీణ్, జహంగీర్, జాయింట్ సెక్రటరీ స్వప్న పాల్గొన్నారు.