స్పౌజ్ బదిలీలు చేపట్టాలి....తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం

స్పౌజ్ బదిలీలు చేపట్టాలి....తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం

బషీర్ బాగ్, వెలుగు: రాష్ట్ర ప్రభుత్వ స్పౌజ్ బదిలీల తరహాలోనే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగుల స్పౌజ్ బదిలీలు చేపట్టాలని తెలంగాణ సెంట్రల్ స్పౌజ్ ఫోరం విజ్ఞప్తి చేసింది.  హైదరాబాద్ లోని బషీర్ బాగ్ ప్రెస్ క్లబ్​లో ఆదివారం ఫోరం ప్రతినిధులు కుమారస్వామి  నాందేవ్ జాదవ్, శైలజ మాట్లాడారు.  జీవో 317తో  నష్టపోయిన స్పౌజ్ ఉద్యోగులకు.. కాంగ్రెస్ ప్రభుత్వం తెచ్చిన జీవో 243తో బదిలీలు చేపట్టారన్నారు. కానీ, భార్యాభర్తల్లో ఒకరు రాష్ట్ర , మరొకరు కేంద్ర  ఉద్యోగులుగా పని చేస్తున్న వారిని పరిగణలోకి తీసుకోలేదన్నారు.