కేసీఆర్ హయాంలో సాగిన ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయ్యి.. జైలులో ఉన్న మాజీ అడిషినల్ ఎస్పీ భుజంగరావుకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసింది కోర్టు. ఈ మేరకు 2024, ఆగస్ట్ 19వ తేదీ కోర్టు ఆదేశాలు ఇచ్చింది. అనారోగ్యంతో ఉన్న భుజంగరావు.. ట్రీట్ మెంట్ తీసుకోవటానికి అనుమతి ఇచ్చింది కోర్టు. 15 రోజుల మధ్యంతర బెయిల్ సమయంలో హైదరాబాద్ సిటీ విడిచి వెళ్లరాదని ఆదేశించింది కోర్టు.
భుజంగరావు గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతున్నారు.. దీనికి చికిత్స చేయించుకోవటానికే ఈ 15 రోజుల మధ్యంతర బెయిల్ మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది కోర్టు. ఫోన్ ట్యాపింగ్ కేసులో ఈయన ఏ2గా ఉన్నారు. 2024, మార్చి 23వ తేదీన అరెస్ట్ అయ్యారు. అప్పటి నుంచి రిమాండ్ ఖైదీగా జైలులో ఉన్నారు.