నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ కొరడా..ఈ ఏడాది 854 కేసులు

నాన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ కొరడా..ఈ ఏడాది 854 కేసులు
  • ఈ ఏడాది 854 కేసులు.. 464 మంది అరెస్టు
  •  డ్రగ్స్, గంజాయి, నాటుసారా, బెల్ట్‌‌‌‌‌‌‌‌ షాపులపై నిఘా
  • టీ న్యాబ్‌‌‌‌‌‌‌‌తో కలిసి జాయింట్ ఆపరేషన్స్‌‌‌‌‌‌‌‌
  •  29.17 శాతం ఎక్కువగా ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌
  •  2024 వార్షిక నివేదిక విడుదల చేసిన ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌

హైదరాబాద్‌‌‌‌‌‌‌‌, వెలుగు : రాష్ట్రంలో నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పెయిడ్ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌పై ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ కొరడా ఝులిపిస్తోంది. డ్రగ్స్‌‌‌‌‌‌‌‌, గంజాయి, నాటు సారా, కల్తీ మద్యం, బెల్ట్‌‌‌‌‌‌‌‌షాపులపై నిఘా పెట్టి నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పెయిడ్‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను కట్టడి చేస్తోంది. నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పెయిడ్‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌ (ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎల్‌‌‌‌‌‌‌‌)కు సంబంధించి ఈ ఏడాది డిసెంబర్‌‌‌‌‌‌‌‌ 24 వరకు 854 కేసులు నమోదు చేసి.. 464 మందిని అరెస్టు చేసింది. ఇందుకు సంబంధించి మొత్తం రూ.1.35 కోట్ల విలువైన 11,329 లీటర్ల మద్యం,80 వాహనాలు స్వాధీనం చేసుకుంది. బెల్ట్‌‌‌‌‌‌‌‌షాప్‌‌‌‌‌‌‌‌లపై 6,915 కేసులు నమోదు చేసింది.

గతంలో ఎన్నడూ లేని విధంగా ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ శాఖ 2024 వార్షిక నివేదికను విడుదల చేసింది. నాంపల్లి ఎగ్జిబిషన్‌‌‌‌‌‌‌‌ గ్రౌండ్స్‌‌‌‌‌‌‌‌ లో శనివారం ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ ఎన్‌‌‌‌‌‌‌‌ఫోర్స్‌‌‌‌‌‌‌‌మెంట్‌‌‌‌‌‌‌‌ డైరెక్టర్‌‌‌‌‌‌‌‌ వీబీ కమలాసన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ కేసుల దర్యాప్తులో టీజీ యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో, రాష్ట్ర పోలీసులతో కలిసి పనిచేస్తున్నామని తెలిపారు. గతేడాదితో పోల్చితే ఈ ఏడాది 29.17 శాతం ఎక్కువగా ఎన్‌‌‌‌‌‌‌‌డీపీఎస్‌‌‌‌‌‌‌‌ యాక్ట్‌‌‌‌‌‌‌‌ నమోదు చేశామని వెల్లడించారు.

ఆపరేషన్ దూల్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌ సక్సెస్‌‌‌‌‌‌‌‌ 

ఎక్సైజ్ నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్న టానిక్‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌ మార్ట్‌‌‌‌‌‌‌‌ లైసెన్స్‌‌‌‌‌‌‌‌ రద్దు చేసినట్టు కమలాసన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు.  ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్‌‌‌‌‌‌‌‌లలో జరిగే పార్టీలు ఇతర ఈవెంట్లలో అనుమతి లేకుండా మద్యం వినియోగిస్తే చర్యలు తీసుకుంటున్నామని వెల్లడించారు. అలాంటి ఫామ్‌‌‌‌‌‌‌‌హౌస్​లు, ఫంక్షన్‌‌‌‌‌‌‌‌ హాళ్లను బ్లాక్‌‌‌‌‌‌‌‌ లిస్ట్‌‌‌‌‌‌‌‌లో పెడుతున్నట్టు తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా స్వాధీనం చేసుకున్న 20,904 కిలోల గంజాయి, ఇతర డ్రగ్స్‌‌‌‌‌‌‌‌ కలిపి మొత్తం రూ.48.54 కోట్ల విలువైన మత్తుపదార్థాలు ధ్వంసం చేసినట్టు తెలిపారు.

2024 డిసెంబర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ 27 వరకు మొత్తం రూ.12.22 కోట్లు విలువ చేసే మత్తుపదార్థాలు స్వాధీనం చేసుకున్నట్టు వెల్లడించారు. ఘట్‌‌‌‌‌‌‌‌కేసర్‌‌‌‌‌‌‌‌ ప్రాంతంలో అల్ఫ్రాజోలం తయారు చేస్తున్న యూనిట్‌‌‌‌‌‌‌‌ను ధ్వంసం చేశామన్నారు. రాష్ట్రవ్యాప్తంగా 25 ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ స్టేషన్ల పరిధిలోని 92 మండలాల్లో గుడుంబా తయారీ ఎక్కువగా ఉందని గుర్తించామన్నారు. గంజాయి కట్టడిలో భాగంగా సీఎం రేవంత్‌‌‌‌‌‌‌‌రెడ్డి ఆదేశాల మేరకు ఆపరేషన్‌‌‌‌‌‌‌‌ దూల్‌‌‌‌‌‌‌‌పేట్‌‌‌‌‌‌‌‌ చేపట్టినట్టు తెలిపారు. కీలక ముఠాల కట్టడితోపాటు 71 కేసులలో 317 మందిని అరెస్టు చేసినట్టు వెల్లడించారు.

న్యూ ఇయర్ సెలబ్రేషన్స్‌‌‌‌‌‌‌‌పై నిఘా

కొత్త సంవత్సర వేడుకల్లో డ్రగ్స్, గంజాయిపై నిఘా పెట్టామని కమలాసన్‌‌‌‌‌‌‌‌ రెడ్డి తెలిపారు. పబ్బులు, అనుమానాస్పద ప్రాంతాల్లో 40 బృందాలు ఏర్పాటు చేసినట్టు తెలిపారు. వీటిలో 17 బృందాలు టీజీ యాంటీ నార్కోటిక్స్‌‌‌‌‌‌‌‌ బ్యూరో, సమన్వయంతో జాయింట్‌‌‌‌‌‌‌‌ ఆపరేషన్లు నిర్వహిస్తామన్నారు.  బంజారాహిల్స్‌‌‌‌‌‌‌‌లోని కమాండ్‌‌‌‌‌‌‌‌ అండ్‌‌‌‌‌‌‌‌ కంట్రోల్‌‌‌‌‌‌‌‌ సెంటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో ఎక్సైజ్‌‌‌‌‌‌‌‌ సిబ్బందిని కూడా ఏర్పాటు చేస్తామన్నారు. అధికారుల తనిఖీల పనితీరును కంట్రోల్‌‌‌‌‌‌‌‌ రూం నుంచి పర్యవేక్షిస్తామన్నారు. అదేవిధంగా నాన్‌‌‌‌‌‌‌‌ డ్యూటీ పెయిడ్‌‌‌‌‌‌‌‌ లిక్కర్‌‌‌‌‌‌‌‌ వినియోగం జరగకుండా చర్యలు తీసుకుంటున్నామని డైరెక్టర్ కమలాసన్ రెడ్డి వెల్లడించారు.