న్యూఢిల్లీ, వెలుగు: ‘ఒక దేశం, ఒకే పెవిలియన్’ గా ప్రపంచ ఆర్థిక సదస్సులో భారతదేశం ప్రదర్శన కనబరచనుంది. ఇందులో ప్రధానంగా తెలంగాణ తో పాటు ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు కేంద్రం అవకాశం కల్పించింది.
ఇందులో మూడు రాష్ట్రాల సీఎంలు మాత్రమే హాజరయ్యేందుకు అనుమతి ఇచ్చింది. ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు, తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి, మహారాష్ట్ర సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ కు అవకాశం దక్కింది. అలాగే భారత్ నుంచి హాజరయ్యే ప్రతినిధి బృందంలో ఐదుగురు కేంద్ర మంత్రులు ఈ సదస్సులో పాల్గొననున్నారు. కేంద్ర ఐటీ, ఎలక్ట్రానిక్స్, రైల్వే శాఖల మంత్రి అశ్వనీ వైష్ణవ్ హాజరుకానున్నారు.