క్వింటా మిర్చికి రూ.25 వేలు ఇవ్వాలి

క్వింటా మిర్చికి రూ.25 వేలు ఇవ్వాలి

కామేపల్లి, వెలుగు : మిర్చి క్వింటాకు రూ.25వేలు మద్దతు ధర నిర్ణయించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ సంస్థలు నా ఫెడ్, మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేయాలని తెలంగాణ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి బొంతు రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు దుగ్గి కృష్ణ డిమాండ్ చేశారు. ఈ విషయమై ఈనెల18న ఖమ్మం వ్యవసాయ మార్కెట్ వద్ద నిర్వహించే రైతుల మహా ధర్నాను సక్సెస్​ చేయాలని పిలుపునిచ్చారు.

ఈ విషయమై శుక్రవారం లాల్యతండా, అడవి మద్దులపల్లి, హరిచంద్ర పురం, కామేపల్లి, ఉటుకూర్, పింజర మడుగు, తాళ్లగూడెం గ్రామాల్లో ప్రచారం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా కమిటీ సభ్యులు గుండా సత్యనారాయణ రెడ్డి, వజ్జా రామారావు, సీపీఎం మండల కార్యదర్శి అంబటి శ్రీనివాసరెడ్డి, రైతు సంఘం మండల కార్యదర్శి సకినాల శ్రీనివాసరావు, గుండా వెంకటరెడ్డి, అడపా రామనాధం, లావూడ్య రామ, మంగిలాల్, రవి, మేడా నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు.