రేగోడ్​ మండలంలో సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

రేగోడ్​ మండలంలో సబ్ స్టేషన్ ముట్టడించిన రైతులు

రేగోడ్, వెలుగు : ట్రాన్స్​ఫార్మర్​పాడైపోయిందని లైన్​మెన్​కు ఫిర్యాదు చేస్తే డబ్బులు డిమాండ్​చేస్తున్నాడని ఆరోపిస్తూ గురువారం రేగోడ్​మండల పరిధిలోని మర్పల్లి గ్రామస్తులు విద్యుత్​సబ్​స్టేషన్​ను ముట్టడించారు. ఈ సందర్భంగా పలువురు రైతులు మాట్లాడుతూ..మర్పల్లి గ్రామ శివారులో 18 మంది రైతులకు చెందిన 30 ఎకరాల సాగు భూమి ఉండగా ఒకే ట్రాన్స్​ఫార్మర్​ఉందన్నారు.

అది కాస్త పాడైపోవడంతో మోటార్లు నడవక నీళ్లు రాక ఉల్లి, జొన్న, కూరగాయల పంటలకు ఇబ్బంది కలుగుతోందన్నారు. దీని గురించి లైన్​మెన్​కిషన్ నాయక్ కు చెప్పినా పట్టించుకోవడం లేదని రైతులు వాపోయారు. వెంటనే లైన్​మెన్​ను సస్పెండ్ చేయాలని నినాదాలు చేశారు.

రేగోడ్ పోలీసులు, విద్యుత్ అధికారి సంఘటన స్థలానికి చేరుకొని మరో ట్రాన్స్ ఫార్మర్​ ఏర్పాటు చేసి సమస్యలను పరిష్కరిస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు.